పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ

  ‘సలార్’. చాలా రోజులుగా ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, ఓ రేంజిలో వైరల్ అవుతోంది.   


‘సలార్’కు ‘కేజీఎఫ్2’కు లింక్!


త్వరలో ‘సలార్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని ప్రకటించారు.  జులై 6న ఉదయం 5:12 నిమిషాలకు ‘సలార్’ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నెట్టింట్లో ఈ సినిమా గురించి జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు, ‘సలార్’ సినిమాను ‘కేజీఎఫ్2’ చిత్రంతో లింక్ పెడుతూ నెటిజన్లు జోరుగా మీమ్స్ చేస్తున్నారు.


ఇంతకీ అసలు విషయం ఏంటంటే?


ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ‘కేజీఎఫ్2’లో రాఖీ భాయ్ చనిపోయే సమయం, తాజా మూవీ ‘సలార్’ టీజర్ రిలీజ్ టైమ్ ఒకటే కావడం విశేషం. రాఖీ భాయ్ తన దగ్గర ఉన్న మొత్తం బంగారంతో షిప్‌లో సముద్రంలోకి వెళ్తారు. తుఫాన్ లో చిక్కుకుని షిప్ మునిగిపోతుంది. ‘కేజీఎఫ్’ హీరో రాఖీ భాయ్ చనిపోతాడు. షిప్ మునిగిపోయే సమయంలో.. అందులో ఉన్న వాచ్ లో సమయంలో ఉదయం 5 గంటల 12 నిమిషాలు చూపిస్తుంది. ఇదే విషయాన్ని నెటిజన్లు హైలెట్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్2’లోని ఎండింగ్ సీన్ టైం, ప్రభాస్ ‘సలార్’ మూవీ టీజర్ రిలీజ్ టైం ఒకటే అంటూ మీమ్స్ చేస్తున్నారు.  


అంతేకాదు, ‘సలార్’ మూవీ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తోందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. కచ్చితంగా ‘కేజీఎఫ్’ సినిమాతో ‘సలార్’కు లింక్ ఉందని భావిస్తున్నారు. రాఖీ భాయ్, సలార్ మంచి ఫ్రెండ్స్ అని, రాఖీ భాయ్ కి ఇచ్చిన మాట ప్రకారమే అండర్ వరల్డ్ డాన్లను అంతం చేసేందుకు ‘సలార్’ రంగంలోకి దిగుతాడని చెప్పుకొస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది తెలియదు కానీ, నెట్టింట్లో మాత్రం బాగా చర్చలు జరుగుతున్నాయి.  











సెప్టెంబ‌ర్ 28న 'సలార్' రిలీజ్


తెలుగు, త‌మిళం, హిందీతో పాటు వివిధ భార‌తీయ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 28న 'సలార్' రిలీజ్ కానుంది. సలార్ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తుండగా.. శృతిహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు పలు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు వంద రోజులే స‌మ‌యం ఉండ‌టంతో టీజ‌ర్ రిలీజ్ నుంచే ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.


Read Also: ఈ కొరియన్ థ్రిల్లర్స్ చూస్తే, ఊపిరి బిగపట్టుకుని సీటు అంచున కూర్చోవాల్సిందే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial