Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!

అఖిల్ 'ఏజెంట్' సినిమా విడుదల ఇప్పటికి రెండు మూడు సార్లు వాయిదా పడింది. అయితే, ఈసారి వాయిదా పడే ప్రసక్తే లేదట. వేసవి సీజన్ స్టార్టింగులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఏజెంట్' (Agent Movie). సెట్స్ మీదకు వెళ్ళి చాలా రోజులు అయ్యింది. మరి, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది? తొలుత గత ఏడాది ఆగస్టు 12న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆ రోజు థియేటర్లలోకి రాలేదు. తర్వాత సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, పెద్ద పండక్కి కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరి, ఎప్పుడు వస్తుంది? అంటే... వేసవిలో అని వినబడుతోంది. 

Continues below advertisement

ఏప్రిల్ 14న 'ఏజెంట్' విడుదలవేసవిలో 'ఏజెంట్' ప్రేక్షకులు ముందుకు రావడం గ్యారెంటీ! ఈ ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. త్వరలో ఆ మేరకు అధికారిక ప్రకటన రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

యాక్షన్ & అఖిల్ ప్యాక్డ్ బాడీ
'ఏజెంట్'పై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ ఆరు నెలల క్రితమే విడుదల అయ్యింది. అందులో మలయాళ స్టార్ మమ్ముట్టి, అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య... అందరినీ చూపించారు. 

అఖిల్ అక్కినేనిని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసే అధికారిగా 'ఏజెంట్'లో మమ్ముట్టి కనిపించనున్నారు. 'అతడిని పట్టుకోవడం కుదరదా?' అనే ప్రశ్న ఆయన ముందుకు వచ్చినప్పుడు... ''ఎటువంటి ఆధారాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నాడు'' అని సమాధానం చెబుతారు. అత్యంత ప్రమాదకరమైన దేశభక్తుడిగా అఖిల్ కనిపించనున్నారు. 'ఏజెంట్' కోసం అఖిల్ అక్కినేని ప్యాక్డ్ బాడీ చేశారు. సిక్స్ ప్యాక్ కాదు... ఆయన ఎయిట్ ప్యాక్ చేశారు. ఆల్రెడీ ఆయన స్టిల్స్, ముఖ్యంగా టీజర్ లో గన్ షూట్ చేసిన స్టైల్ వైరల్ అవుతోంది.  

స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న 'ఏజెంట్' హీరోగా అఖిల్‌కు 5వ సినిమా. ఇందులో పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. 

Also Read  : తారక రత్నను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ - మృత్యుంజయ మంత్రంతో... 

ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'సైరా' హిందీలో కూడా విడుదల కావడంతో అక్కడి ప్రేక్షకులు కొంత మందికి ఆయన తెలుసు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా'లో నాగ చైతన్య నటించడం, 'బ్రహ్మాస్త్ర'తో నాగార్జున విజయం అందుకోవడం... అక్కినేని హీరోగా అఖిల్ అక్కడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.    

Also Read : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్ 

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమన్ వర్క్ చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. అఖిల్ సినిమాకు ఆయనకు ఎటువంటి పాటలు, నేపథ్య సంగీతం అందించారో చూడాలి. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్‌: నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్‌: అవినాష్ కొల్లా, సహ నిర్మాతలు: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి. 

Continues below advertisement
Sponsored Links by Taboola