Adivi Sesh and Shruti Haasan are joining hands to bring a unique story of love and beyond: యువ కథానాయకులలో అడివి శేష్ పంథా భిన్నమైనది. ఆయన కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు... భారతీయ ప్రేక్షకులు అందరికీ నచ్చేలా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన 'క్షణం' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే... 'గూఢచారి' మంచి హిట్ అయ్యింది. 'మేజర్' తెలుగు, హిందీ భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం 'గూఢచారి 2' సినిమా పనుల్లో బిజీగా ఉన్న అడివి శేష్... మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. 


అడివి శేష్ జోడీగా శృతి హాసన్!
అడివి శేష్ కొత్త సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించనున్నారు. ఈ రోజు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. 


Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!






నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మాణంలో... 
అడివి శేష్, శ్రుతి హాసన్ నటించనున్న సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) ప్రొడ్యూస్ చేయనున్నారు. చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఆమె చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే... పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!


అడివి శేష్, శృతి హాసన్ జంటగా సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు అమెరికాలో జన్మించిన, అక్కడ పెరిగిన షానియల్ డియో దర్శకత్వం వహిస్తారు. అయితే... తెలుగుకు ఆయన కొత్త కాదు. ఆల్రెడీ అడివి శేష్ 'క్షణం', 'గూఢచారి' చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'లైలా' షార్ట్ ఫిలింకు షానియల్ డియో డైరెక్ట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 


గత ఏడాది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మేజర్' తర్వాత అడివి శేష్ మరో సినిమా చేయలేదు. 'గూఢచారి 2'ను స్టార్ట్ చేశారంతే! ఇటీవల విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' చిత్రంలోని ప్రత్యేక గీతం 'ఒడియమ్మా బీటు'లో శృతి హాసన్ సందడి చేశారు. ఈ నెల 22న విడుదల కానున్న 'సలార్' సినిమాలో ఆమె జర్నలిస్ట్ ఆద్య పాత్ర చేశారు.