Operation Valentine movie release date announcement: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పాన్ ఇండియా సినిమా 'ఆపరేషన్ వేలంటైన్'. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రమిది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
ఫిబ్రవరి 16న వరుణ్ తేజ్ హిందీ సినిమా!
Operation Valentine aka VT13 release on February 16 2024: ప్రేమికుల రోజుకు రెండు రోజుల తర్వాత అంటే... ఫిబ్రవరి 16, 2024లో 'ఆపరేషన్ వేలంటైన్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. నిజానికి... ఈ సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఆ వారం మరో రెండు సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు.
'ఆపరేషన్ వేలంటైన్' సినిమాలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Manushi Chhillar) కథానాయికగా నటించారు. ఇది యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమా అయినప్పటికీ... నాయిక పాత్రకు ప్రాధాన్యం ఉందని ఆమె తెలిపారు. 'ఆపరేషన్ వేలంటైన్'కు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. ఆయన లాయర్. సినిమాపై ప్రేమతో దర్శకుడిగా మారారు. ఇంతకు ముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీశారు. ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అవుతున్నారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
''శక్తి ప్రతాప్ సింగ్ లాయర్ కావడంతో చాలా రీసెర్చ్ చేసి కథ రాశారు. స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. అది చదువుతుంటే... తర్వాత ఏం జరుగుతుందో? అనే ఉత్కంఠ నాలో పెరిగింది. నా క్యారెక్టర్ కూడా బాగా రాశారు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన నటన తీసుకోవడం ఎలాగో శక్తి ప్రతాప్ సింగ్ గారికి తెలుసు. వరుణ్ తేజ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని మానుషీ చిల్లర్ తెలిపారు. అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో ఆమె కథానాయికగా పరిచయం అయ్యారు. హిందీలోనూ ఆమెకు అది తొలి సినిమా ఈ 'ఆపరేషన్ వేలంటైన్' తెలుగులో మొదటి సినిమా.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Varun Tej Role In Operation Valentine Movie : వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రమిది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 'ఆపరేషన్ వేలంటైన్' సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ జెట్ పైలట్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఆయన స్టిల్స్, వీడియోలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలపై సందీప్ ముద్ద భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. దీనికి నంద కుమార్ అబ్బినేని సహ నిర్మాత.