Saindhav MovieSarada Saradaga Lyrical Song: విక్టరీ వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైంధవ్’. వెంకీ కెరీర్ లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ మూవీ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్, సాంగ్ విడుద‌ల చేశారు. తాజాగా రెండో సింగిల్ ను రిలీజ్ చేశారు. విజయవాడ వీవీఐటీ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు చిత్రంబృందం ఈవెంట్ లో పాల్గొంది.


'సరదా సరదాగా..' అలరిస్తున్న సెకెండ్ సింగిల్


ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలోని సెకెండ్ సింగిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 'సరదా సరదాగా..' అంటూ సాగే ఈ సాంగ్ వీనుల విందుగా ఉంది. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ పాటలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య  డైలాగులు కూడా చక్కగా ఆకట్టుకుంటున్నాయి. వెంకీ కూతురిగా సారా ఈ పాటలో హైలెట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను అమితంగా అలరిస్తోంది. వెంకటేష్, శ్రద్ధా, సారా మధ్యన సాగే ఈ పాట హృదయాలను హత్తుకుంటోంది. ఈ పాటలో వెంకటేష్, శ్రద్ధా మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ముగ్గురి మధ్య బంధాన్ని వివరిస్తుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ మరింత హైలెట్ గా నిలిచింది.



ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా..  


ఇక ‘సైంధవ్’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట మాస్ ప్రేక్షకుల టార్గెట్ చేసుకుని వచ్చింది. రెండో సాంగ్ మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకుంది. నిజానికి వెంకటేష్ సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతాయి. ఆయన సినిమాల్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్లు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలే. ఈ సినిమా కూడా అదే కథాంశంతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇందులో కూతురు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.


సంక్రాంతి బరిలో ‘సైంధవ్’


ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో తమిళ్ హీరో ఆర్య కనిపించనున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, రుహానీ శర్మ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  నిజానికి ఈ  మూవీ ఈ నెల 22న విడుదల కావాల్సిన ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు మేకర్స్. 


Read Also: 73వ వసంతంతోకి రజనీకాంత్, తలైవా గురించి 9 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!