Happy Birthday Super Star Rajinikanth: రజనీకాంత్. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన నటుడు. స్పెషల్ రీల్ మ్యానరిజమ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్,  మాస్ డైలాగ్ డెలివరీతో తనంకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. వెండి తెర మీద ఎంత గొప్పగా కనిపిస్తారో, తెర వెనుక అంత వినయపూర్వకంగా వ్యవహరిస్తారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నా, కోట్లాది మంది అభిమానులు ఉన్నా, చాలా సింపుల్ గా ఉంటారు. డబ్బు ఎంతైనా ఉండనీ, సామాన్యుడిగా ఉండటమే తనకు ఇష్టం అంటారాయన. అభిమానులు ప్రేమగా తలైవా అని పిలుచుకునే రజనీకాంత్ 72 ఏండ్లు పూర్తి చేసుకుని 73వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ స్టార్స్, ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.


1975లో సినీ కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్


1975లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ దిగ్గజన నటుడు, ఏడు పదుల వయసు దాటినా, కుర్ర హీరోలకు మించిన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్ ఎదిగారు. సినీ పరిశ్రమకు తను చేసిన సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..     


రజనీకాంత్ గురించి 9 ఆసక్తికర విషయాలు


1.రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆ తర్వాత అతడికి మరాఠా రాజు ఛత్రపతి శివాజీ పేరు పెట్టారు.  


2.రజనీకాంత్  చిన్నప్పటి నుంచే మరాఠీ, కన్నడ మాట్లాడుతూ పెరిగారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు చేస్తున్నప్పుడు తమిళం నేర్చుకున్నారు


3.నటనా రంగంలోకి రాకముందు రజనీకాంత్ కొంతకాలం కూలీగా పని చేశారు. ఆ తర్వాత కార్పెంటర్‌గా, మరికొంత కాలం బస్ కండక్టర్‌గా పనిచేశారు.  


4.50 ఏళ్ల సినీ కెరీర్‌లో రజనీకాంత్ 170కి పైగా సినిమాల్లో నటించారు.   


5.బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రజనీకి ప్రేరణ.  బిగ్ బికి సంబంధించిన దాదాపు డజను సినిమాల తమిళ   రీమేక్‌లలో నటించాడు.


6.రజనీకాంత్ ఇప్పుడు దిగ్గజ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా, తన కెరీర్ విలన్ పాత్రతో మొదలు పెట్టారు.  


7.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సిలబస్‌లో కనిపించిన ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్.  'From Bus Conductor to Superstar' అనే పేరుతో ఆయన గురించి ఓ పాఠాన్ని పొందుపరిచారు.     


8.బ్లాక్ అండ్ వైట్, కలర్, 3D, మోషన్ క్యాప్చర్ లాంటి విభిన్న కెమెరా టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన చిత్రాలలో పనిచేసిన తొలి ఇండియన్ యాక్టర్ గా రజనీకాంత్ గుర్తింపు తెచ్చుకున్నారు.  


9.2010లో ప్రపంచ వ్యాప్తంగా IMDb టాప్ 50 చిత్రాలలో స్థానం సంపాదించిన ఏకైక తమిళ చిత్రం రజనీకాంత్ 'ఎంతిరన్'(రోబో) కావడం విశేషం.


Read Also: ‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా?