Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో చివరి ఎలిమినేషన్ ముగిసింది. ఈ ఎలిమినేషన్‌లో శోభా శెట్టి బిగ్ బాస్ హౌజ్ వదిలి బయటికి వచ్చేసింది. అయితే శోభా ప్రవర్తన నచ్చని తన హేటర్స్.. తను ఎప్పుడో హౌజ్ నుండి బయటికి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎప్పుడో మొదట్లోనే తను వెళ్లిపోతుందని ఆశపడినా.. 14 వారాల వరకు తనను హౌజ్‌లోనే ఉండనిచ్చాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఫేవర్ వల్లే తను ఇంకా షోలో ఉందని చాలామంది ప్రేక్షకులు భావించారు. ఫైనల్‌గా ఫైనల్స్‌కు చేరుకోకముందే ఎలిమినేట్ అవ్వడంతో హేటర్స్ తృప్తిపడుతున్నారు. అయితే ఈ 14 వారాల పాటు శోభా రెమ్యునరేషన్‌ ఇదేనంటూ సమాచారం వైరల్ అవుతోంది.


డేంజర్ జోన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ సీజన్ 7లో అనవసరంగా అరవడం, కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకుల సహనానికి కూడా పరీక్ష పెట్టడం.. ఇలా చాలా చేసింది శోభా శెట్టి. తన హేటర్స్ ఎంత ఎదురుచూసినా.. ఎలిమినేట్ అవ్వకపోవడంతో ఇక టాప్ 5కు కూడా వెళ్లిపోతుందేమో అనుకున్నారు. కానీ 14వ వారం జరిగిన ఎలిమినేషన్‌లో శోభా వెళ్లిపోయింది. ఇక 14వ వారం అర్జున్ మినహా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. అందులో అందరికంటే ఎక్కువ ఓట్లు పల్లవి ప్రశాంత్‌కు రాగా.. తన తరువాతి స్థానంలో శివాజీ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, అమర్‌దీప్ ఉన్నారు. ఇక డేంజర్ జోన్‌లో ప్రియాంక, శోభా ఉండగా.. ఇద్దరి ఓటింగ్ శాతం మధ్య చాలా తక్కువ తేడా ఉంది. అందుకే చివరి నిమిషం వరకు శోభా ఎలిమినేట్ అవుతుందా లేదా అని అనుమానాలు ఉన్నాయి.


14 వారాలకు ఎంతంటే..?
ఇక హౌజ్ నుండి బయటికి వచ్చేసిన తర్వాత శోభా శెట్టి రెమ్యునరేషన్ గురించి చర్చ మొదలయ్యింది. వారానికి రూ.2.5 లక్షలు ఒప్పందంతో బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యిందట శోభా. తను మొత్తంగా 14 వారాలు హౌజ్‌లో ఉంది కాబట్టి రూ.35 లక్షల రెమ్యునరేషన్‌తో తను ఇంటికి వెళ్లింది. అయితే కనీసం 10 వారాలు ఉంటాననే అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిందని సమాచారం. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అవ్వకముందు తనకు బిగ్ బాస్ కన్నడ నుండి కూడా అవకాశం వచ్చిందట. కానీ తెలుగులో తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తను తెలుగు బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రావడానికే ఒప్పుకుందట.


మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా..?
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ఆరుగురు కంటెస్టెంట్స్.. ఫినాలే వీక్‌లోకి ఎంటర్ అవ్వగా.. ఈవారం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. అలా జరిగితే ఫైనల్స్‌లోకి టాప్ 5 కంటెస్టెంట్స్ వెళ్లగలుగుతారు. మరి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది నిజమా కాదా అని ఇంకా క్లారిటీ లేదు. ఫినాలే వీక్ కాబట్టి కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు, గొడవలు ఏమీ జరగకుండా వారం రోజులు వారు చిల్ అయ్యేలాగా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హౌజ్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌కు తమ జర్నీలు చూపిస్తూ ఎమోషనల్ చేయబోతున్నారు బిగ్ బాస్.


Also Read: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?