సీనియర్ నటి మీన గురించి టాలీవుడ్ లో అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇటీవల మీనా భర్త అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటించడానికి కూడా ఓకే చెప్పింది. అయితే ఇప్పుడు మీనా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె రెండో పెళ్లికి సిద్దమవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మీనాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి అని మీనాను ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారట. దీంతో మీనా కూడా పెళ్లికి అంగీకరించినట్లు సమాాచారం. ఆ చేసుకోబోయే వ్యక్తి కూడా మీనా కుటుంబానికి పరిచయస్తుడేనట. అయితే ఈ విషయంపై ఇటు మీనా నుంచి గానీ ఆమె కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు.
మీనా బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1990 దశకంలో మీనా అగ్ర కాథానాయికల్లో ఒకరుగా ఎదిగింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో దాదాపు టాప్ హీరోలు అందరితో పని చేసింది మీనా. తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. రజనీ కాంత్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో బాలనటిగా నటించి ఆ తర్వాత వాళ్లతోనే హీరోయిన్ గా నటించడం విశేషం. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే 2009లో బెంగుళూరుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను మీనా వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత కూడా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తోంది మీనా. అయితే ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యతో మరణించారు. ఇప్పుడిప్పుడే ఆమె ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటుంది. ఈ నేపథ్యలోనే ఆమె తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వినికిడి. అయితే దీనిపై నటి మీనా ఇప్పటికీ స్సందించలేదు. గతంలో మీనా భర్త మృతి సమయంలోనూ ఆయన మృతికి కారణాలు ఏంటీ అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. వాటిపై మీనా స్పందించింది. తన భర్త చనిపోయాడనే బాధలో ఉన్నానని, తన భర్త మరణంపై చర్చలు పెట్టొదంటూ మీనా సోషల్ మీడియా వేదికగా కోరింది. మరి ఇప్పుడు ఆమె రెండో పెళ్లిపై వస్తోన్న వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ప్రస్తుతం మీనా అందివచ్చిన అశకాశాలను వినియోగించుకంటూ సినిమాల్లో బిజిగా ఉంటోంది. ఆమె ఇటీవల నటించిన ‘దృశ్యం’ మూవీ సీరిస్‌లు మలయాళం, తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ‘దృశ్యం’ పార్ట్ 3ను కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందని సమాచారం.