కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ ఉద్యోగాల భర్తీకి నవంబరు 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 15 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 43


1) అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్: 05 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ & ఇన్‌స్పెక్షన్ - మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫ్యామిలీ వెల్ఫేర్.


2) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఏరోనాటికల్): 02 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


3) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


4) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


5) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్): 03 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


6) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్): 03 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


7) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మెకానికల్): 02 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


8) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మెటలర్జి): 03 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


9) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (టెక్స్‌టైల్): 02 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎస్యూరెన్స్.


10) స్పెషలిస్ట్-గ్రేడ్-3 (ఓటో రైనో లారిన్‌గాలజీ) ENT: 04 ఖాళీలు
విభాగం: హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.


11) మైనింగ్ జియోలజిస్ట్: 07 పోస్టులు
విభాగం: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.


12) అసిస్టెంట్ మైనింగ్ జియోలజిస్ట్: 06 పోస్టులు
విభాగం: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.


13) కెమిస్ట్: 03 పోస్టులు
విభాగం: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.


అర్హత: పోస్టులవారీగా విద్యార అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.


అనుభవం: సంబంధిత విభాగాల్లో  కనీసం 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. కొన్నిపోస్టులకు 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకుు 35 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 40 సంవత్సరాలు గరిష్ఠవయసుగా నిర్ణయించారు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2022.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.12.2022.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 16.12.2022.


Notification


Online Application 


Also Read: 


Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Navy Jobs: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...