టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన్పటినుంచీ దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీ ఇప్పటివరకూ అధికారికంగా లాంచ్ అవలేదు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే దానిపై ముందునుంచీ పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా  ‘ఎన్టీఆర్ 30’ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటన చేశారు మేకర్స్. నటి జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మేరకు మూవీ మేకర్స్ ఆమెను హీరోయిన్ గా పరిచయం చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జంటను తెరపై ఊహించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. 


గతం నుంచీ ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. అయితే వీటిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అయితే తాజాగా ఆమె సినిమాలో ఉందంటూ చేసిన ప్రకటనతో ఆ వార్తలకు చెక్ పడింది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో జాన్వీ కపూర్ అచ్చమయిన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉంటోంది కాబట్టి, జాన్వీ కపూర్ పోస్టర్ వెనక సముద్రాన్ని చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ లో హీరోయిన్ గా ఈమె ఒక్కరేనా లేదా ఇంకా ఎవరైనా హీరోయిన్ లుగా నటిస్తున్నారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 


Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!


అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆమె ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఇదే జాన్వీకి మొదటి సినిమా. శ్రీదేవికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది తెలుగు ఇండస్ట్రీ. టాలీవుడ్ లో శ్రీదేవి పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి హీరోయిన్ కూతురిగా జాన్వీ తెలుగలో సినిమా చేయడం విశేషం. అందులోనూ తనకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని గతంలో కూడా చెప్పింది జాన్వీ. ఎన్టీఆర్ తో సినిమా చేయడం డ్రీమ్ రోల్ అని తెలిపింది. దీంతో ఇప్పుడు నిజంగానే తన అభిమాన హీరోతో సినిమా చేయడం పట్ల జాన్వీ హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అమెరికాలో జరగనున్న ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో పాల్గొనేందుకు బయలుదేరారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ మార్చిలో సినిమాను మొదలెడతామని చెప్పిన నేపథ్యంలో ఈ మూవీపై ఉత్కంఠ పెరిగింది. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.