Sharwanand: ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షిత ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. రెండు రోజుల పాటు లీలా ప్యాలెస్ లో శర్వా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శర్వా పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులతో పాటు సన్నిహితులు సినీ, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి వేడుక అనంతరం జూన్ 9 న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు శర్వానంద్. ఈ మేరకు శర్వానంద్ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం కాసేపు ముఖ్యమంత్రితో ముచ్చటించారు.
జూన్ 9 న టాలీవుడ్ షూటింగ్స్ కు బ్రేక్ పడనుందా?
జూన్ 9 న టాలీవుడ్ లో ఇద్దరి సెలబ్రెటీల ఫంక్షన్ లు జరగనున్నాయి. ఓ వైపు శర్వానంద్-రక్షిత ల రిసెప్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగానే హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా జూన్ 9 నే జరగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్-లావణ్య ల ప్రేమ వ్యవహారం పై మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. దీనిపై కుటుంబ సభ్యులు కూడా హింట్ ఇచ్చారనే చెప్పాలి. తాజాగా మెగా ఫ్యామిలీకు సన్నిహింతంగా ఉండే ఓ వ్యక్తి వీరి లవ్ మ్యాటర్ ను కంఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించుకున్నట్టుగానే జూన్ 9 వరుణ్-లావణ్య ల నిశ్చితార్థం జరుగుతుందని చెప్పారట ఆ వ్యక్తి. అయితే పూర్తి సమాచారం చెప్పలేదట. కానీ జూన్ 9 న ఉదయం వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని అంటున్నారు. దీంతో ఉదయం నిశ్చితార్థం, సాయంత్రం రిసెప్షన్ ఫంక్షన్ లతో టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా ఫుల్ బిజీ అయిపోతారని తెలుస్తుంది. మరి జూన్ 9 న షూటింగ్ లకు బ్రేక్ ఇస్తారా లేదా అనేది తెలియాలి.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ..
శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగులో ‘ఐదో తారీఖు’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు శర్వానంద్. దీని తర్వాత పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘గమ్యం’ సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించారు. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత శర్వాకు సరైన హిట్ పడలేదు. కానీ గతేడాది ఆయన నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్.