Krithi Shetty: టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఫ్లాప్ లను చవిచూస్తోంది. రామ్ తో నటించిన ‘వారియర్’ సినిమాతో కృతి ఫ్లాప్ లు మొదలైయ్యాయి. తెలుగులో అమ్మడుకి ఇప్పుడు సరైన ఆఫర్లేవీ రావట్లేదని టాక్. అందుకే ఇతర భాషల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది ఈ బ్యూటీ. ఇప్పటికే మలయాళంలో టొవినో థామస్ సినిమాలో నటిస్తుండగా తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కృతి శెట్టి చీరకట్టులో మెరిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కృతి..
కెరీర్ ప్రారంభంలో వరుస హిట్ లతో దూసుకుపోయింది కృతి శెట్టి. తర్వాత హీరో రామ్ తో ‘వారియర్’ సినిమాలో నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో టాలీవుడ్ కి పులిస్టాప్ పెట్టి ఇతర భాషల్లో నటిస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మలయాళ సినిమా ఒక్కటే ఉంది. మొన్నామధ్య తమిళ్ లో ఓ సినిమాలో సెలెక్ట్ అయినా తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు తమిళ్ స్టార్ నటుడు జయం రవి సినిమాలో చాన్స్ కొట్టేసింది బేబమ్మ. ఇటీవలే ఈ సినిమా లంఛనంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం కృతి ఆశలు అన్నీ ఈ సినిమాల మీదే ఉన్నాయి. తమిళ్, మలయాళం లో హిట్ అందుకుంటేనే మళ్లీ టాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలతో అయినా బేబమ్మ ఫేట్ మారుతుందో లేదో చూడాలి.
పాన్ ఇండియా సినిమాగా ‘జీని’..
‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో అరుళ్ మొళిగా టైటిల్ పాత్రను పోషించాడు జయం రవి. ఆయనకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. జయం రవి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. దానితో పాటు మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమాకు ‘జీని’ అనే టైటిల్ దీనికి జీనీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ మూవీతో జేఆర్ అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టితో పాటు కల్యాణి ప్రియదర్శన్, వామిక కబి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ యాక్టర్ దేవయాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ ఈ పిక్చర్ కు సంగీతం అందిస్తున్నారు. మహేశ్ ముత్తుసామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
Also Read: మేమిద్దరం ప్రేమ కంటే ముందు శారీరకంగానే ఆకర్షితులయ్యాం - తమ లస్ట్ స్టోరీ చెప్పిన విద్యాబాలన్