Vidya Balan: బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు. ఆమె దాంపత్య జీవితం విషయాలు కూడా రహస్యంగానే ఉంచుతారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విద్యా బాలన్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


మాది లస్ట్ యట్ ఫస్ట్ సైట్: విద్యా బాలన్


ఈ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ తన భర్త ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో రిలేషన్షిప్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు ఎలా కలిశారో చెప్పుకొచ్చింది. తమది లస్ట్ యట్ ఫస్ట్ సైట్ అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది విద్యా. నిజానికి తమ మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ ఫిజికల్ ముందు శారీరకంగానే ఆకర్షితులయ్యాం అని చెప్పింది. సిద్ధార్థ్ చాలా అందంగా ఉంటాడని, అంతేకాకుండా తనను సెక్యూర్ గా చూసుకునే విధానం కూడా తనకు చాలా నచ్చిందని పేర్కొంది. తాను మొదట్లో ప్రతి విషయం పట్ల ఓవర్గా రియాక్ట్ అయ్యేదాన్నని అయితే ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్లు చెప్పుకొచ్చింది విద్యా.


ఆ విషయంలో సిద్ధార్థే నాకు కరెక్ట్ అనిపించాడు


తమ ప్రేమ విషయంలో ముందుగా సిద్ధార్థ్ ను తనకు ప్రజోజ్ చేశాడని చెప్పింది విద్యా. అయితే తనను సెక్యూర్ గా చూసుకోవడంలో సిద్ధార్థ్ ఆమె తండ్రిని గుర్తు చేస్తున్నాడని చెప్పింది. తన తండ్రితో ఎంతో సెక్యూర్ గా ఉండేదాన్నని ఇప్పుడు తన తండ్రిని సిద్ధార్థ్ లో చూసుకుంటున్నానని చెప్పింది విద్యా. వాస్తవానికి లైఫ్ పార్టనర్ లోనే మనం పేరెంట్స్ ను వెతుక్కుంటాం ఆ విషయంలో సిద్ధార్థ్ తనకు కరెక్ట్ అని అనిపిచిందని చెప్పింది. అయితే సిద్ధార్థ్ కాస్త ప్రయివేట్ గా ఉండే వ్యక్తిత్వం అంటూ తన భర్త గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. 


2012 లో సిద్ధార్థ్ తో పెళ్లి..


విద్య బాలన్ కేరళకు చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే సినిమాల మీద ఆసక్తితో నటన వైపు అడుగులు వేసింది. 2003 లో ‘భాలో థేకొ’ అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2011 లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమాతో విద్యా క్రేజ్ మరింతగా పెరిగింది. తర్వాత ఏడాది 2012 లో నిర్మాత అయిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఫంక్షన్ ఏదైనా చీరలో దర్శనమివ్వడం విద్యా స్పెషాలిటీ. అందుకే ఆమె చీరకట్టుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతేడాది ‘జల్సా’ అనే సినిమాలో నటించింది విద్యా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.


Also Read: రికార్డు రేటుకు ప్రభాస్ 'సలార్' తెలుగు థియేట్రికల్ రైట్స్ - ఇది రెబల్ స్టార్ ర్యాంపేజ్!