Actor Fish Venkat health Issues : సినిమా కష్టాలని చెప్పడానికి కామెడీగా ఉంటాయి కానీ.. అలాంటి కష్టాలు వస్తే తట్టుకోవడం కష్టమని అనుభవించే వారికే తెలుస్తుంది. ఇలాంటి కష్టాలను సినీ నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సూపర్ హిట్ సినిమాల్లో కామెడీ విలన్ పాత్రల్లో నటించారు. ఎంతో మందిని నవ్వించారు. అయితే ఇటీవల ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే ఆయనను సినిమా కష్టాలు వెంటాడుతున్నాయని తెలింది.
ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్
ఫిష్ వెంకట్ కు ఇటీవల ఆరోగ్యం సహకరించం లేదు. ఏమైందా అని టెస్టులు చేయించుకుంటే రెండు కిడ్నీలు పాడైపోయాయని తేలింది. దీంతో ఆయన రెగ్యులర్ గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ అనారోగ్యం కారణంగా ఆయన సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయడం లేదు. తన వ్యాపారం చేపల అమ్మకం ద్వారా సంపాదించిన సొమ్ముతో పాటు సినిమాల ద్వారా సంపాదించినది కూడా వైద్యానికి ఖర్చయిపోయింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకునేంత ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ప్రభు్తవ ఆస్పత్రులకు వెళ్తున్నారు. వారిచ్చిన మందులతోనే ప్రాణం కాపాడుకుంటున్నారు.
అక్కినేని ఫ్యామిలీ ఆపన్న హస్తం, వరద బాధితుల సాయం కోసం రూ. కోటి విరాళం
మగపిల్లలు చూడటం లేదని వైద్యం చేయించడం లేదని ఆవేదన
ఆయన పిల్లలు కూడా ఆయనను చూడటం లేదు. ఫిష్ వెంకట్ కు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మగ పిల్లలకు వ్యాపారాలు కూడా పెట్టించారు. అయితే ఇప్పుడు వారు తనను పట్టించుకోవడం లేదని ఫిష్ వెంకట్ వాపోతున్నారు. అప్పుడప్పుడు వచ్చి పలకరించినా వైద్యం కోసం ఆర్థిక సాయం చేయడం లేదని అంటున్నారు. చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లో ఉండేది కాదు. అందుకే ఆయన ఎక్కువగా సంపాదించుకోలేకపోయారు.
Also Read: బాసూ.... మీది మెగా మనసు - చిరు, పవన్ తర్వాత గ్లోబల్ స్టార్ భారీ సాయం, ఎంత విరాళం ఇచ్చారంటే?
సినీ పరిశ్రమ ఆదుకోవాలని విజ్ఞప్తి
ఫిష్ వెంకట్ గురించి ఇప్పటి వరకూ బయటకు తెలియలేదు. ఇప్పుడు ఆయన నోరు విప్పి తన ఆరోగ్య పరిస్థితి బాగో లేదని.. వైద్య చికిత్సకూ డబ్బులు లేవని చెప్పడంతో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా స్పందించి ఆయనకు సాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. పలువురు అగ్రహీరోలతో కలిసి ఆయన నటించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థల్లోనూ నటించారు. ఎవరైనా వైద్య సహకారం అందిస్తే కోలుకుని సినిమాల్లో నటించాలని.. ఆయన అనుకుంటున్నారు. మరి ఎవరైనా సాయం చేస్తారో లేదో ?