మెగా ఫ్యామిలీ నుంచి మరో కోటి రూపాయల విరాళం వచ్చింది. ప్రజలకు అండగా మేము సైతం అంటూ మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు ముందు అడుగు వేశారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టోటల్ రూ. 6 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల కష్ట నష్టాలు పడుతున్న ప్రజల సహాయార్థం పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. 


రామ్ చరణ్ ఏమన్నారంటే?


''వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు (Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని ట్వీట్ చేశారు రామ్ చరణ్. 







''తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచి వేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా... నా వంతుగా కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను'' అని చిరంజీవి పేర్కొన్నారు.


Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు



మెగా ఫ్యామిలీ తొమ్మిది కోట్ల విరాళం
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి, రామ్ చరణ్ నుంచి చెరొక కోటి రూపాయలు విరాళం రావడంతో మెగా కుటుంబం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్ల రూపాయలు విరాళం వచ్చినట్టు అయ్యింది. ఈ ఏడాది కేరళలోని వాయనాడ్ విపత్తు సహాయక చర్యల కోసం తండ్రి తనయులు కలిసి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. పవన్ కల్యాణ్ మొత్తం మీద ఆరు కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి తొమ్మిది కోట్ల రూపాయల మేజర్ విరాళాలు వచ్చాయి. ఇక, బయటకు తెలియకుండా చిత్ర పరిశ్రమలో కార్మికులకు, నటీనటులకు చేసిన గుప్త దానాలు చాలా ఉన్నాయని టాలీవుడ్ టాక్.


Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే



ఏపీ, తెలంగాణకు టాలీవుడ్ భారీ విరాళాలుటాలీవుడ్ టాప్ హీరోలు అందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలకు భారీ ఎత్తున విరాళాలు వెల్లడించారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఏపీ, తెలంగాణకు చెరో 50 లక్షల రూపాయల చొప్పున కోటి విరాళం ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైతం కోటి కోటి చొప్పున రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సహాయక చర్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ. 6 కోట్ల విరాళం ఇచ్చారు. నిర్మాతలు చినబాబు, నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 30 లక్షలు, హీరో సిద్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 10 లక్షలు, విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు, హీరోయిన్ అనన్యా నాగళ్ల రూ. 5 లక్షలు, యాంకర్ స్రవంతి చొక్కారపు రూ. లక్ష రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారు.