Aadavaallu Meeku Johaarlu: నవరాత్రి పాటందుకున్న రాధిక, ఊర్వశి.. సిగ్గుపడిన రష్మిక

ఎక్కడ చూసినా శరన్నవరాత్రుల సందడే చివరికి షూటింగ్స్ లో కూడా శరన్నవరాత్రుల సందర్భంగా తమకు కుదిరినట్టు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా రాధిక, ఊర్వశి, రష్మిక సందడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continues below advertisement

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ  కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌ఎల్‌వీ  సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్‌‌లో చిన్న బ్రేక్ దొరికింది. దీంతో రాధిక, ఊర్వశి, రష్మిక కాసేపు సందడి చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Continues below advertisement

 శివాజీ గణేశన్, సావిత్రి కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘నవరాత్రి’లో పాపులర్‌ సాంగ్‌ ‘నవరాతిరి.. శుభరాతిరి’ని రాధిక, ఊర్వశి పాడగా రష్మిక సిగ్గుపడుతోంది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో 'పుష్ప' లో నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్  విడుదలకానుంది. ఇపప్టికే ఈ సినిమా నుంచి విడుదలైన రష్మిక లుక్‌కి మంచి మార్కులే పడ్డాయి.  తెలుగుతో పాటూ కన్నడ, తమిళం,  హిందీలోనూ సత్తా చాటుకుంటున్న శాండల్ వుడ్ బ్యూటీ ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదల కాకుండానే రష్మిక 'టాప్ టక్కర్' అనే పాప్ ఆల్బమ్‌తో పలకరించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో  అమితాబ్ బచ్చన్‌‌తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. 

Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్
Also Read: క్రిష్‌‌తో సినిమా అనగానే ఒప్పేసుకోమన్నా.. ‘కొండ పొలం’పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read:వైష్ణవ్-రకుల్ 'కొండపొలం' ట్విట్టర్ రివ్యూ
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..


Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola