ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2020 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2020లో వచ్చిన సినిమాలకు గాను ఈ అవార్డులను అందించారు. ఈసారి దాదాపు నాలుగొందల సినిమాలు అవార్డుల కోసం పోటీ పడగా.. పదిహేను ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో 'కలర్ ఫోటో' సినిమాకి అవార్డు దక్కింది. 


అలానే ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్(అల వైకుంఠపురములో) కి అవార్డు దక్కింది. ది అన్‌సంగ్ వారియర్ చిత్రానికి ఉత్తమ నటుడిగా అజయ్ దేవగన్, సూరరై పొట్రు చిత్రానికి హీరో సూర్య ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రధానం చేశారు. ఈ వేడుకలో ఒక్క తమిళ చిత్ర పరిశ్రమకే మొత్తం 10 అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా, నటుడు సూర్య, నటి జ్యోతికల 2D ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ నిర్మించిన ‘సురారై పోటోరు’ చిత్రం OTT ప్లాట్‌ఫామ్‌పై విడుదలై భారీ విజయాన్ని సాధించింది. మొత్తం ఐదు అవార్డులను వసూలు చేసింది.


68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న విజేతల వివరాలు:


బెస్ట్ తెలుగు ఫిల్మ్- కలర్ ఫొటో


బెస్ట్ డ్యాన్స్- నాట్యం, సంధ్యా రాజు


బెస్ట్ సాంగ్స్ - అల వైకుంఠపురంలో


బెస్ట్ బీజీఎం- సూరారై పొట్రు


బెస్ట్ స్టంట్స్- అయ్యప్పనుమ్ కోషియమ్


బెస్ట్ మేకప్ - నాట్యం


బెస్ట్ స్క్రీన్ ప్లే- సూరారై పొట్రు


బెస్ట్ డైలాగ్స్- మండేలా


బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- బిజు మీనన్


బెస్ట్ యాక్ట్రస్- అపర్ణ మురళి


బెస్ట్ యాక్టర్- సూర్య, అజయ్ దేవగణ్


బెస్ట్ డైరెక్టర్- సచ్చిదనందన్ కేఆర్


బెస్ట్ ఫీచర్ ఫిల్మ్- సూరారై పొట్రు


నాన్‌ ఫీచర్ ఫిలింస్‌.. 
 
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌  (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌  భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
 
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)


వీరితోపాటు ప్రముఖ నటి ఆశాపరేఖ్ కూడా భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.


Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?



Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?