'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. మన ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వసూళ్లు రికార్డులు మాత్రమే కాదు... భారతీయ, విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా పలువురు హాలీవుడ్ దర్శక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ 'ఆర్ఆర్ఆర్' అద్భుతమని ప్రశంసిస్తూ ట్వీట్లు వేశారు. ప్రశంసలకు తోడు ఇప్పుడు అవార్డులు కూడా వస్తున్నాయి.
Rajamoui's RRR Movie Wins One More Accolade : శాటన్ (50th Saturn Awards) అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్... మూడు విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్'కు నామినేషన్ లభించింది. దర్శకుడిగా రాజమౌళికి అవార్డు రానప్పటికీ... ఆయన సినిమాకు అవార్డు వచ్చింది. మరో అరుదైన గౌరవం అందుకుంది.
'ఆర్ఆర్ఆర్' జపాన్‌లో విడుదల అయిన సందర్భంగా... అక్కడికి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి కూడా వెళ్లారు. అందువల్ల, శాటన్ అవార్డు అందుకోవడానికి ఆయన నేరుగా వెళ్ళలేపోయారు. అయితే... వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
''మా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం తరఫున శాటన్ అవార్డుల జ్యూరీకి థాంక్స్. మా సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు రెండో శాటన్ అవార్డు. ఇంతకు ముందు 'బాహుబలి : ది కన్‌క్లూజన్' సినిమాకు అవార్డు అందుకున్నాను. ఇతర పురస్కార విజేతలకు నా అభినందనలు'' అని రాజమౌళి పేర్కొన్నారు. బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ విభాగంలో సినిమా, బెస్ట్ డైరెక్టర్ విభాగంలో రాజమౌళి పోటీ పడుతున్నారు. ఆ ఫలితాలు త్వరలో రానున్నాయి.
ఆస్కార్ అవార్డులకు ముందు...
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు ఎనర్జీ!
'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వస్తే చూడాలని యావత్ భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియా నుంచి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో సినిమాను పంపలేదు. అయితే... 'ఆర్ఆర్ఆర్' అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాకుండా, ఇతర విభాగాల్లో సినిమాను నామినేట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ అవార్డులకు ముందు శాటన్ అవార్డు రావడం 'ఆర్ఆర్ఆర్' అభిమానులకు మంచి ఎనర్జీ ఇచ్చిందని చెప్పవచ్చు.
Also Read : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' @ టెంపుల్ సెట్!
RRR Movie and Akhanda selected for IFFI 2022 screening : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ప్రతి ఏడాది గోవాలో జరుగుతుంది. ఈసారి నవంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నారు. ఆ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమాలో ప్రదర్శించనున్న ఫీచర్ ఫిల్మ్స్, మెయిన్ స్ట్రీమ్ సినిమా కేటగిరీలో కూడా 'ఆర్ఆర్ఆర్' ఎంపిక అయ్యింది. దాంతో పాటు 'ఆఖండ' కూడా చోటు సంపాదించుకుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు.