మరాఠీ భాషలో తెరకెక్కించిన 'నటసామ్రాట్' సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న సినిమా అది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు కృష్ణవంశీ. నాలుగేళ్ల క్రితమే సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. కానీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ రూపంలో మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 


ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజే చేయడానికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఈ డీల్ గనుక కుదిరితే నిర్మాతలు లాభాలతో బయటపడే ఛాన్స్ ఉంది. నిజానికి ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఇలాంటి కథలను థియేటర్లో ఎంతవరకు ఆదరిస్తారో చెప్పలేని పరిస్థితి. ఓటీటీలో రిలీజ్ చేస్తే గనుక ఇది మంచి డీల్ అనే చెప్పాలి. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. 


ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమా రషెస్ ను కృష్ణవంశీ తన స్నేహితులు కొంతమందికి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అయిందట. ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. 


ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ రేంజ్ బజ్ రావడమంటే విశేషమనే చెప్పాలి. అందుకే క్రేజీ ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 


Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార


Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్