Vijay Thalapathy: తమిళనాడు రాజకీయ చరిత్రలొ ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్ధాలుగా డీఎంకే, ఏఐడీఎంకే మధ్య సాగుతున్న ద్విముఖ రాజకీయ పోరును తెరమరుగు చేస్తూ, సినీ నటుడు విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కజగం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌  చూపించింది. కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన  నాయకుడిగా విజయ్ ప్రజల్లోకి వెళ్లిన తీరు ఎన్నికల ట్రెండ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 

Continues below advertisement

విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దాదాపు 100 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది కేవలం విజయ్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయ నిర్మాణంలో వస్తున్న ఒక వ్యవస్థాగత మార్పు. ప్రస్తుత ట్రెండ్స్‌ పరిశీలిస్తే, ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే టీవీకే స్పష్టమైన మెజారిటీతో ముందుకు సాగుతోంది. అదే  సమయంలో అధికారంలో ఉన్న డీఎంకే అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోయింది. 

తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇంత వేగంగా ఒక ఒక్క పార్టీ ప్రభావాన్ని చూపడం ఇదే మొదటిసారి. గతంలో ఎంఎంజీఆర్ వంటి దిగ్గజ నటులు సైతం సినీ పాపులారిటీని రాజకీయ విజయంగా మార్చుకోవడానికి దశాబ్దాల క లం పట్టింది. కానీ విజయ్ ఆ ప్రయాణాన్ని చాలా  తక్కువ కాలంలోనే పూర్తి చేసి చూపించారు.

Continues below advertisement

విజయ్ రాజకీయ ఎదుగుదల వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. 1974లో చెన్నైలో జన్మించిన జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్, తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేకర్ దర్శకత్వంలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. తొలినాళ్లలో సాధారణ నటుడిగా ఉన్న విజయ్‌, ిల్లి వంటి చిత్రాల తర్వాత మాస్ హీరోగా మారిపోయారు. 

Also Read: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు

విజయ్ ఎంచుకున్న పాత్రలు కేవలం వినోదం కోసమే కాకుండా, సామాజిక అన్యాయాలను ఎదిరించే విధంగా ఉండేవి. అవినీతి కార్పొరేట్ దోపిడీ, ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన సినిమాల్లో చూపిన పోరాటం ప్రజల్లో ఆయనపై పట్ల నమ్మకాన్ని కలిగించింది. ఈ సినిమాటిక్ ఇమేజ్్ రాజకీయ నాయకుడిగా ఆయనకు ఒక బలమైన పునాదిని వేసింది. ముఖ్యంగా డీఎంకే  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పాలనాపరమైన విమర్శలు విజయ్ పార్టీకి అనుకూలంగా మారాయి. 

Also Read:కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభంజనం! వెనుకంజలో అధికార ఎల్‌డీఎఫ్‌!

విజయ్ రాజకీయ ప్రవేశం అనేది ఒక ఆకస్మిక నిర్ణయం కాదు. దీని వెనుక ఏళ్ల తరబడి జరిగిన క్షేత్రస్థాయి కృషి ఉంది. ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం ఒక సంస్థాగత  నిర్మాణంగా మారి, ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించింది. 2024లో పార్టీని ప్రకటించి, సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయ్ వెల్లడించడం ద్వారా తాను  రాజకీయాలను ఎంత నిబద్ధతతో ఉన్నారో నిరూపించుకున్నారు. 

ఆయన ప్రచారం ప్రధానంగా సుపరిపాలన, అవినీతి  నిర్మూలన, ప్రజల అభివృద్ధి చుట్టూ సాగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాత రాజకీయ పార్టీల ఓటు బ్యాంకులను టీవీకే బద్దలు కొట్టగలిగింది. మూడు దశాబ్దాల పాటు ప్రేక్షకుల నుంచి సంపాదించుకున్న ఎమోషన్  క్యాపిటల్‌ నేడు ఓట్ల రూపంలోకి మారింది.

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!

తమిళనాడు రాజకీయాల్లో సినిమా, రాజకీయాల మధ్య విడదీయలేని సంబంధం ఉంది. అయితే జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల తర్వాత ఏర్పడిన నాయకత్వం శూన్యాన్ని విజయ్ సమర్థవంతంగా భర్తీ చేసినట్టు కనిపిస్తోంది. డీఎంకే పట్ల పెరిగిన అసంతృప్తిని కేవలం ఒక నిరసన ఓటుగా కాకుండా, టీవీకేను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించారు. 

ప్రస్తుత ట్రెండ్స్ ఫైనల్ ఫలితాలుగా మారితే, విజయ్ కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా, తమిళనాడు భవిష్యత్‌ను నిర్ణయించే ఒక శక్తిమంతమైన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుస్తారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి ఆరంభం. లెగసీ పార్టీలకు సవాలు విసురుతూ, ఒక సరికొత్త రాజకీయ సంస్కృతికి విజయ్ పునాది వేశారు.