Kerala Assembly Election Results 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా తొలి ట్రెండ్స్ నుంచే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌(UDF) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి యూడీఎఫ్‌ 83  ఎల్‌డీఎఫ్‌ 42 ఇతరులకు 13 స్థానాలు వచ్చాయి. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూటమికి ఈ ఫలితాలు ఊరట ఇచ్చాయి. మరోవైపు వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశించిన పినరయి విజయ్‌ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి విజయన్‌ స్వయంగా ధర్మడమ్‌ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం ఎల్‌డీఎఫ్‌ పతనాన్ని స్పష్టం చేస్తోంది. 

ఈ ఎన్నికల ఫలితాలకు ప్రధానంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఒక కారణంగా కాగా, కాంగ్రెస్ కూటమి ఇచ్చిన వాగ్దానాలను ప్రజలను ఆకర్షించాయి. 2021 ఎన్నికల్లో కరోనా మహమ్మారి సమయంలో అందించిన సంక్షేమ పథకాల వల్ల ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి గెలిచింది. అయితే 2026 నాటికి ఆర్థిక సవాళ్లు, నిరుద్యోగిత, ఇతర పాలనాపరమైన అంశాలు ప్రజల్లో అసంతృప్తి పెంచాయి. ముఖ్యంగా విద్యావంతులైన యువతలో ఉపాధి అవకాశాల కొరత పెద్ద చర్చనీయాంశమైంది. 

Also Read: కాలేజీ డ్రాపౌట్ నుంచి పొలిటికల్ కింగ్‌గా దళపతి విజయ్ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఏం చదివారంటే

కేరళలో ఏప్రిల్ 9న 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఐదేళ్లుగా ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం నవ రేళ మిషన్ పేరిట లైఫ్‌ మిషన్, ఆర్ధ్రం మిషన్, హరిత కేరళ మిషన్ వంటి పథకాలను అమలు చేసింది. ఈ పథకాల ద్వారా వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ప్రభుత్వం పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చారు. కానీ, ఎన్నికల సమయానికి ఇవేవీ ఎల్‌డీఎఫ్‌ను గట్టెకించలేకపోయాయి. 

కేరళ అభివృద్ధి నివేదిక ప్రకారం, రాష్ట్రం విద్య, ఆరోగ్య రంగాల్లో దేశంలోన అగ్రస్థానంలో ఉంది. కేరళలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి కేవలం ఐదుగురు. ఇది అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉంది. 2026-27 బడ్దెట్‌లో ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ వృద్ధాప్య బడ్జెటింగ్‌ అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేరళలో వృద్ధుల జనాభా పెరుగుతున్న వేళ వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం ఈ బడ్జెట్‌ ప్రత్యేకత. 

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!

కేరళ ప్రభుత్వ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధులలలో తగ్గుదల, రాష్ట్ర అప్పుల భారం కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డు, వంతెనలు, ప్రాజెక్టులను నిర్మించారు. నాలెడ్జె్‌ ఎకానమీ దిశగా కేరళ అడుగులు వేస్తూ, ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. 

కేరళ పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వెన్నెముక వంటిది. ముఖ్యంగా అలప్పుజలోని హౌస్‌బోట్ ప్రయాణాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. రుతుపవనాల సమయంలో కేరళ అందాలు చూడముచ్చగా ఉంటాయి. బాధ్యతాయుతమైన పర్యాటకం ద్వారా స్ఆనిక ప్రజలను ఉపాధి కల్పించడంలో కేరళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆయమనం గ్రామం మొదటి మోడల్ ఆర్టీ విలేజ్‌గా గుర్తింపు పొందింది. 

కేరళ ఎన్నికల ఫలితాలు 2026 రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా భావించి వచ్చు. యూడీఎఫ్‌ విజయం దాదాపు ఖాయం కావడంతో కొత్త ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన పెద్ద బాధ్యత ఉంది.ఆర్థిక లోటును అధిగమించడం, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ కొత్త ప్రభుత్వానికి ప్రధాన వాళ్లుగా నిలవనున్నాయి.