PM Modi Rally: 'దేశంలో ఆ ఇద్దరికీ మోదీ, యోగి, వ్యాక్సిన్ అంటే భయం'

ABP Desam   |  Murali Krishna   |  17 Feb 2022 07:21 PM (IST)

దేశంలో ఇద్దరికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ అంటే భయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ

దేశంలో కేవలం ఇద్దరు వ్యక్తులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫతేపుర్‌లో జరిగిన బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీపై మోదీ విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో హోలీ మార్చి 10నే జరుగుతుందని మోదీ అన్నారు.

నేను పంజాబ్‌ నుంచి ఇక్కడకి వస్తున్నాను. పంజాబ్ మొత్తం భాజపాకే ఓటేయాలనుకుంటోంది. అలానే యూపీలో కూడా ప్రతి వడతలోనూ భాజపాకే ఓటు వేస్తున్నారు. పరివార్‌వాదీ (సమాజ్‌వాదీ) పార్టీ.. కరోనా వ్యాక్సిన్లను భాజపా టీకాలను పిలుస్తోంది. దేశంలో ఇద్దరు మాత్రమే కరోనా వ్యాక్సిన్లకు భయపడుతున్నారు. ఒకరు కరోనా వ్యాక్సిన్ కాగా మరొకరు టీకాలను వ్యతిరేకించేవారు. వీరందరికీ మోదీ, యోగీ, వ్యాక్సిన్లతో సమస్య ఉంది.                                                      -  ప్రధాని నరేంద్ర మోదీ

కాంగ్రెస్ నమ్మకద్రోహం

అంతకుముందు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రైతులకు నమ్మక ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​దని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్​ను అమలు చేయకుండా చాలా ఏళ్లుగా అబద్ధాలతో గడిపేశారన్నారు.

తాము అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్​ను అమలు చేసినట్లు తెలిపారు. భాజపా ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. పంజాబ్‌లో భాజపా కూటమిదే అధికారమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Punjab Assembly 2022: 'నెహ్రూపై నిందలు ఎందుకు? ఏడున్నరేళ్లలో మీరు చేసిందేంటి?'

Also Read: ITBP Viral Video: గస్తీ మే సవాల్! చైనా సరిహద్దుల్లో 15 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల పహారా

Published at: 17 Feb 2022 07:18 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.