TDP First List: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేససిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో చాలా విశేషాలు ఉన్నాయంటున్నాయి ఆపార్టీ వర్గాలు. ఫిబ్రవరి 24న వచ్చే ఎన్నికల సంబంధించిన తొలి జాబితాను విజయవాడ వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో టీడీపీ 94 మందికి ఈ లిస్ట్‌లో చోటు కల్పించగా... 24 స్థానాల్లో పోటీ చేయబోతున్న జనసేన కేవలం ఐదుగురు పేర్లు మాత్రమే వెల్లడించింది. మిగతా వారి వివరాలు త్వరాలనే చెబుతామంటున్నారు పవన్ కల్యాణ్


94 మందితో కూడిన టీడీపీ మొదటి జాబితా పరిశీలిస్తే చాలా కాలిక్యులేటెడ్‌గా లిస్ట్ ప్రిపేర్ చేసినట్టు చెబుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు, గతంలో హామీ ఇచ్చినట్టు యువతకు కూడాచోటు కల్పించారు. మహిళలకు తగిన స్థాయిలో స్థానం ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన జాబితాలోని 94 మందిలో 24 మంది కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించింది.  


24మంది తొలిసారిగా అసెంబ్లీ కి పోటీచేయనున్నారు. ఆ వివరాలు


1. తొయ్యక జగదీశ్వరి  కురుపాం
2.  విజయ్ బోనెల. పార్వతీపురం
3. కొండపల్లి శ్రీనివాస్ - గజపతినగరం
4. యనమల దివ్య - తుని
5. మహాసేన రాజేష్ - పి.గన్నవరం
6. ఆదిరెడ్డి వాసు - రాజమండ్రి సిటీ
7.  బడేటి రాధాకృష్ణ - ఏలూరు
8. సొంగ రోషన్ - చింతలపూడి
9.  కొలికళాపూడి శ్రీనివాస్ - తిరువూరు
10. వెనిగండ్ల రాము - గుడివాడ
11.  వర్ల కుమార్ రాజా - పామర్రు
12. వేగేశ్న నరేంద్ర వర్మ - బాపట్ల
13.  గూడూరి ఎరిక్షన్ బాబు - ఎర్రగొండపాలెం
14. కావ్యా కృష్ణ రెడ్డి - కావలి
15.  నెలవల విజయశ్రీ - సూళ్లూరుపేట
16. కాకర్ల సురేష్ - ఉదయగిరి
17.  మాధవీరెడ్డి - కడప
18. బొగ్గుల దస్తగిరి - కోడుమూరు
19.  అమిరినేని సురేంద్ర బాబు - కల్యాణ దుర్గం
20. ఎం. ఈ సునీల్ కుమార్ - మడకశిర
21.  సవిత - పెనుగొండ
22. జయచంద్ర రెడ్డి - తంబల్లపల్లి
23.  వీఎం థామస్ - జీడీ నెల్లూరు
24.  గురజాల జగన్మోహన్ - చిత్తురు


చాలా వేదికలపై యువతు చోటు కల్పిస్తామని చంద్రబాబుతోపాటు లోకేష్‌ కూడా చెప్పారు. ఈసారి రాజకీయం మనదేనంటూ యువతను ప్రోత్సహించారు. అన్నట్టుగానే ప్రస్తుతం విడుల చేసిన జాబితాలో 23 మందికి స్థానం కల్పించారు. ఈ జాబితాలో 25 నుంచి 35 ఏళ్లు ఉన్న వాళ్లు ఇద్దరు ఉన్నారు. 36 నుంచి 45 మధ్య వయసు కలిపిన నేతలు 22 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు 55 మందికి చోటు దొరికింది. 60 ఏళ్లకు పైబడిన వాళ్ల సంఖ్య 20గా ఉంది. 
మొదటి జాబితాలో ప్రకటించిన లిస్ట్‌లో 13 మంది మహిళలకు చోటు దక్కింది. ఈ జాబితాలో పీజీలు చదివిన వారు 28 మంది ఉంటే... డిగ్రీ చదివిన వాళ్లు 50 మంది ఉన్నారు. డాక్టర్లు ముగ్గురు, పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఇద్దరు. ఒకరు ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఉన్నారు. 


టీడీపీ తొలి జాబితా లో కులాల వారీగా లెక్కలు 


కమ్మ-21
ఎస్సీ- 20
బీసీ-18
రెడ్డి- 17
కాపు- 7 
ఎస్టీ-3
క్షత్రియ-4
వెలమ-1
వైశ్య-2
మైనార్టీ- 1


బీసీలలో
గవర-1, 
శెట్టిబలిజ-1
యాదవ్-3
పొలినాటి వెలమ -1
కొప్పుల వెలమ-2
తూర్పు కాపు- 2
గౌడ్-3
కాళింగ-2 
మత్స్యకార-1
కురుబ-1
బోయ-1


టీడీపీ 2019లో బిసీలకి 43 సీట్లు ఇచ్చింది. మిగిలిన 57సీట్లలో ఆ పార్టీ 25 ఇవ్వగలిగితే గత ఎన్నికల లెక్క చేరినట్టు. 


జనసేన-5 ఇచ్చిన ఐదు సీట్లలో కులాల వారీగా లెక్కలు చూస్తే... 


కమ్మ-1
కాపు-2
గవర-1
బ్రాహ్మణ-1


ఈ జాబితా తయారీలో చాలా అధునాతనమైన పద్దతులను ఉపయోగించి అభ్యర్థులను ఎంపిక చేశామంటున్నారు చంద్రబాబు. కోటీ 3 లక్షల 33 వేల మందికిపైగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థుల వడపోత జరిగిందన్నారు.