PM Modi Live: రాసిపెట్టుకోండి మళ్లీ మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుద్ది: ప్రధాని మోదీ పవర్‌పుల్‌ డైలాగ్స్‌

ABP Desam   |  Murali Krishna   |  10 Mar 2022 08:49 PM (IST)

PM Modi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవే ఫలితాలు 2024లోనూ రిపీట్ అవుతాయన్నారు.

భాజపా విజయంపై ప్రధాని మోదీ

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా జయకేతనం ఎగురవేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గెలుపును ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికే ప్రజలు పట్టంగట్టారని అన్నారు. ఈ ఫలితాల్లో దేశానికి గొప్ప సందేశం ఉందని పేర్కొన్నారు. భాజపా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు చెప్పారు.

మార్చి 10 నుంచే హోలీ మొదలవుతుందని మేం ముందే చెప్పాం. ఇది మా ఎన్‌డీఏకి 'విక్టరీ 4'. భారత ప్రజాస్వామిక ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భాజపాను గెలిపించినందుకు కృతజ్ఞతలు. తొలిసారి ఓటేసిన యువకులు భాజపాకు మద్దతుగా నిలిచారు. భాజపా నిర్ణయాలు, విధానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రజల అఖండ మద్దతే ఈ విజయానికి కారణం. ఈ ఎన్నికల ఫలితాల్లో గొప్ప సందేశం ఉంది. భాజపా పాలనపై ప్రజలకు నమ్మకం పెరిగింది. గోవాలో అందరి అంచనాలు తారుమారయ్యాయి. యూపీలో రెండోసారి పట్టంకట్టి రికార్డ్ సృష్టించారు. ఉత్తరాఖండ్‌లో భాజపా స్థానాలు పెరిగాయి.                                                                - ప్రధాని నరేంద్ర మోదీ

అభివృద్ధికే పట్టం

ఉత్తర్​ప్రదేశ్​లో వరుసగా రెండోసారి అధికారాన్ని కట్టబెట్టి చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు సీఎం యోగి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో ఏడు దశల ఎన్నికలు ప్రశాంతంగా జరగడం గొప్ప విషయమన్నారు. ఆవేశంతో ఉన్నప్పుడు సంయమనం కోల్పోకూడదని, కరోనా సమయంలో పోరాటం చేసేటప్పుడు ప్రతిపక్షాలు తమపై కుట్ర చేశాయని ఆరోపించారు.

ప్రజలు భాజపాకు చిరస్మరణీయ విజయాన్ని అందించి జాతీయవాదం, సుపరిపాలననే గెలిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యూపీ, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అభివృద్ధే విజయం సాధిస్తుందని నిరూపణైంది.                                                             - యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం

Also Read: UP Election Result 2022: యూపీని ఊపేసిన యోగి మేనియా- అయ్యగారి తర్వాత ఆయనే- 2024లో ప్రధాని అభ్యర్థిగా!

Also Read: Bhagwant Mann Profile: స్టాండప్ కమెడియన్ నుంచి సీఎంగా స్టాండింగ్ వరకూ ! పంజాబ్ హీరో భగవంత్ మన్ !

Published at: 10 Mar 2022 08:18 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.