Peddapalle Lok Sabha Elections 2024: పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ క్రిష్ణ ఘన విజయాన్ని నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పై 131364 ఓట్ల మెజారిటీ సాధించారు. గడ్డం వంశీక్రిష్ణకు 475587 ఓట్లు పోలయ్యాయి. శ్రీనివాస్ కు 344223 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 193356 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు ప్రదర్శించాయి. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీక్రిష్ణ మొదటి నుంచి ముందంజలో దూసుకుపోయారు. ఈయనకు ఉదయం వేళ 11 గంటల సమయానికి 231735 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ 63871 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 142249 లక్షల ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది.