Nizamabad Lok Sabha Elections 2024: నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఘన విజయాన్ని వరుసగా రెండోసారి నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డిపై 109241 ఓట్ల మెజారిటీ సాధించారు. ధర్మపురి అర్వింద్ కు 592318 ఓట్లు పోలయ్యాయి. జీవన్ రెడ్డికి 483077  ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ కు 102406  ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు సత్తా చాటాయి. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మొదటి నుంచి ముందంజలోనే దూసుకుపోయారు. ఈయనకు ఉదయం 11 గంటల సమయానికి 2,82,634 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి 45,100 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ మాత్రం 2.31 లక్షల ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.