Chevella Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం చూపడం లేదు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఈయనకు 417982 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి 107148 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని 335930 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానంలోనే కొనసాగుతోంది.