YS Sharmila Responds On AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది.' అంటూ ట్వీట్ చేశారు. కాగా, కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన షర్మిల అక్కడ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కడప ఎంపీగా వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుపొందారు.






Also Read: Chandrababu: 'సుదీర్ఘ యాత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు' - భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు, హిస్టారికల్ విక్టరీ అన్న చంద్రబాబు