AP Uttarandhra Election Result 2024: ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో మినహా మిగిలిన 31 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాల్లో 10 స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయనగరం జిల్లాలోని తొమ్మిది స్థానాలకుగాను తొమ్మిది స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 స్థానాలకుగాను రెండు స్థానాల్లో మినహా 13 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు.
Uttarandhra Assmbly Election Result 2024: జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, టెక్కలి, పలాస, శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆముదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. అలాగే విజయనగరం జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు మ్యూజియం చేసిన సాగుతున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతిపురం, కురుపాం, గజపతినగరం, ఎస్ కోట నియోజకవర్గాల్లో కూటమికి చెందిన నేతలు పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 స్థానాల్లో 13 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం వైపు సాగుతున్నారు. అరకు, పాడేరు స్థానాల్లో వైసిపి అభ్యర్థులు మెజారిటీలో కొనసాగుతుండగా.. భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు.