Anakapalli Assembly Constituency: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం అనకాపల్లి. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గానికి తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 15 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం సాధించగా, ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,45,955 మంది ఓటర్లు ఉన్నారు. వీరులో పురుషులు 1,19146 మంది ఓటర్లు కాగా, మహిళా ఓటర్లు 1,26,793 మంది ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు
1952లో ఎక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన కే గోవిందరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కేఎల్పి నుంచి పోటీ చేసిన వి వెంకటరమణపై 6622 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కేఎల్పి నుంచి పోటీ చేసిన బి అప్పారావు ఎక్కడ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన కే గోవిందరావుపై 679 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కే గోవిందరావు సిపిఐ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బిఏ నాయుడుపై 11773 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1967లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన కే గోవిందరావు మరోసారి ఎక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బీజే నాయుడుపై 8290 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీవీ రమణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన కే గోవిందరావు పై 6893 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన కే గోవిందరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన పీవీ చలపతిరావుపై 8437 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన రాజా కన్నబాబు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎం.లక్ష్మి నారాయణపై 25,384 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1985లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన దాడి వీరభద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎస్ సత్యనారాయణపై 29,541 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన దాడి వీరభద్రరావు రెండోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దిలీప్ కుమార్ పై 2258 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో దాడి వీరభద్రరావు మూడోసారి వరుసగా విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దిలీప్ కుమార్ పై 1655 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి మరోసారి పోటీ చేసిన దాడి వీరభద్రరావు వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి కొణతాల రామకృష్ణపై 3711 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొణతాల రామకృష్ణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన దాడి వీరభద్రరావుపై 17,033 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొణతాల రామకృష్ణపై 10,866 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన పీజీ సత్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన కొణతాల రఘునాథ్ పై 22,341 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఇక్కడ విజయం సాధించారు. టిడిపి నుంచి పోటీ చేసిన పీలా గోవిందపై 8,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఈ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంతోమంది రాష్ట్రంలో ఏర్పడిన మంత్రివర్గంలో మంత్రులుగా పని చేశారు. గతంలో దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు మంత్రులుగా పని చేయగా, గడిచిన ఎన్నికల్లో ఎక్కడి నుంచి విజయం సాధించిన గుడివాడ అమర్నాథ్ కూడా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ ను తప్పించి మన్సాల భరత్ కుమార్ అనే కొత్త వ్యక్తిని వైసీపీ బరిలోకి దించుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న ఆసక్తి నెలకొంది.