మీరు నిత్యం ఉపయోగించే మౌస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

మౌస్‌ను మొదట డిస్‌ప్లే సిస్టమ్ కోసం X-Y పొజిషన్ ఇండికేటర్‌గా తయారు చేశారు. 1973లో జిరాక్స్ ఆల్టో కంప్యూటర్ సిస్టమ్‌లో దీన్ని మొదటిసారిగా ఉపయోగించారు.

Continues below advertisement

డెస్క్‌ టాప్ కంప్యూటర్ ఉన్న వాళ్లంతా మౌస్‌ లేనిదే పని చేయలేరు. కొందరు ల్యాప్‌టాప్ వాడేటప్పుడు కూడా మౌస్ యూజ్ చేస్తారు. ఇంతకీ ఇంత ముఖ్యమైన మౌస్‌ ఎలా వచ్చిందో తెలుసా?

Continues below advertisement

కంప్యూటర్ మౌస్‌ను 1960లో బిల్ ఇంగ్లీష్ సహాయంతో డగ్లస్ ఎంగెల్‌బార్ట్ కనుగొన్నారు. నవంబర్ 17, 1970న ఈ మౌస్‌కు పేటెంట్ హక్కులు పొందారు. మౌస్‌ను తయారు చేసేటప్పటికీ డగ్లస్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం కోసం పని చేసే సంస్థ ఇది.

మౌస్‌ను మొదట డిస్‌ప్లే సిస్టమ్ కోసం X-Y పొజిషన్ ఇండికేటర్‌గా తయారు చేశారు. 1973లో జిరాక్స్ ఆల్టో కంప్యూటర్ సిస్టమ్‌లో దీన్ని మొదటిసారిగా ఉపయోగించారు. మౌస్‌ని ఉపయోగించి ఆల్టో కంప్యూటర్‌లో కర్సర్‌ను మౌస్‌తో డగ్లస్ కదిలించారు. 

డగ్లస్‌ తయారు చేసిన మౌస్‌ పని చేసినా... ఆ ప్రయోగం విజయవంతమైనప్పటికీ ఇది పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఆపిల్‌ లిసా కంప్యూటర్‌లో మొట్టమొదటిగా విస్తృతంగా మౌస్‌ను ఉపయోగించారు. అప్పటి నుంచి మౌస్‌ ప్రాధాన్యత టెక్కీలంతా గుర్తించారు. 

మొదటి కంప్యూటర్ మౌస్

న్యూ మెక్సికో మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ అండ్ సైన్స్‌లో మొదటి మౌస్‌ ఉంచారు. మొదటి మౌస్ చెక్కతో తయారు చేశారు. నేటి మౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండేది. దీర్ఘచతురస్రాకార పరిమాణంలో ఉండేది. కుడివైపు మూలన ఒక చిన్న బటన్ మాత్రమే ఉంది. దాని ఆధారంగానే కర్సర్‌ కదిలించాల్సి వచ్చేది. 

మౌస్ ఇప్పటికీ ప్రతి డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో ఉపయోగిస్తున్నారు. ల్యాప్‌టాప్ వచ్చేసరికి మౌస్‌ టచ్‌ప్యాడ్ రూపంలో మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో టచ్ స్క్రీన్‌లు వచ్చేశాయి. దీంతో మౌస్‌ ప్రధాన్యత తగ్గిపోతోంది. 

కంప్యూటర్ మౌస్‌ ఆ పేరు ఎలా వచ్చింది 
మౌస్ వెనుక నుంచి వైర్‌ కనిపిస్తుంది. ఇది చూడటానికి అచ్చం ఎలుక మాదిరిగా ఉంటుంది. అందుకే దీనికి మౌస్ అని పేరు పెట్టినట్టు డగ్లస్ తెలిపారు. 

Also Read: పిట్ట రేటు ఫిక్స్‌! నెలకు రూ.1600 కాదు రూ.600 మాత్రమే అన్న మస్క్‌

Also Read: ప్యాంటు వేసుకున్నప్పుడల్లా గుర్రం గుర్తుకొస్తుంది- నవ్వు కూడా వస్తుంది!

Continues below advertisement