దేశంలో 'ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022' నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్‌ రెండు రకాలుగా ఉంటుంది.

అవి:


1) ఉపాధిని పెంపొందించడానికి ఇంటర్న్‌షిప్ 


2) పరిశోధనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇంటర్న్‌షిప్


డిగ్రీలో చేరిన విద్యార్థులకు నాలుగో సెమిస్టర్‌ తర్వాత 60 నుంచి 120 గంటలు, రిసెర్చ్ ఆనర్స్‌ డిగ్రీ చదువుతున్న వారికి 360 గంటలు ఇంటర్న్‌షిప్‌ ఉండాలని యూజీసీ సూచించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరిగా ఉండాలని యూజీసీ గతేడాదే ప్రకటించింది. అయితే తాజాగా జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పరిశోధన, ఆవిష్కరణలు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలను విడుదల చేసింది.


క్రెడిట్లు ఇలా..


➥ మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సు (రీసెర్చ్‌తో ఆనర్స్‌)లో కనీసం 2-4 క్రెడిట్లను ఇంటర్న్‌షిప్‌కు కేటాయించాలి. ఇంటర్న్‌షిప్‌లో ఒక క్రెడిట్‌ అంటే వారానికి రెండు గంటలు ఉండాలి. దీని ప్రకారం 15 వారాల సెమిస్టర్‌లో ఒక క్రెడిట్‌కు 30 గంటలు చేయాలి.


➥ నాలుగేళ్ల పరిశోధన ఆనర్స్‌ డిగ్రీలో ఎనిమిది సెమిస్టర్లలో 12 క్రెడిట్లు పరిశోధన ప్రాజెక్టు ఉంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా పరిశోధన ప్రాజెక్టు, థీసీస్‌, ప్రాజెక్టువర్క్‌ను గైడ్‌కు సమర్పించాలి. ఎనిమిదో సెమిస్టర్‌లో 360 గంటల వ్యవధితో పరిశోధన ఉండాలని ముసాయిదాలో పేర్కొంది. పరిశోధన ప్రాజెక్టు కింద ఇంటర్న్‌షిప్‌ సక్రమంగా సాగేందుకు ఉన్నత విద్యా సంస్థలు రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని ఆదేశించింది.


➥ 2023లో కామర్స్‌ విద్యార్థులు అత్యధికంగా 60.62% మంది ఉద్యోగాలు పొందారని, డిగ్రీ చదివినవారిలో 88.6% మంది ఇంటర్న్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారని ఇటీవల విడుదల చేసిన ఇండియా స్కిల్‌ రిపోర్టు పేర్కొంది.


                               


ALSO READ:


యూనివర్సిటీలకు యూజీసీ కీలక ఆదేశాలు, ఆ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందే!
దేశంలోని యూనివర్సీటీలు, కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థలన్నీ ఇకపై తమ వెబ్‌సైట్‌లలో ఫీజులు, రిఫండ్ పాలసీ, హాస్టల్ వసతులు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్, ర్యాంకింగ్స్, అక్రిడిటేషన్ వంటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకతను పెంచేలా, విద్యార్థులు తప్పుదోవపట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ & సేఫ్టీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు, కనీస అర్హత ఇంటర్
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఫైర్‌, హెల్త్‌ సేఫ్టీ కోర్సుల్లో గ్రేటర్‌  పరిధిలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి అక్టోబరు 8న ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, ఫైర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, సబ్‌ ఫైర్‌ ఆఫీసర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు. 
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...