తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లు అప్‌లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. హాల్‌టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హాల్‌టికెట్ల ఇంటర్ బోర్డు అదికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సంబంధిత జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ లాగిన్ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసి, వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15న మొదలు కాగా, ఏప్రిల్ 3న ముగియనున్నాయి. సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగియనున్నాయి.
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు :
- మార్చి 15 - బుధవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లీష్ పేపర్ 1
- మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్ పేపర్ 1ఎ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
- మార్చి 23 - గురువారం - మ్యాథ్స్ 1బి, హిస్టరీ పేపర్ 1, జువాలజీ పేపర్ 1
- మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనావిుక్స్ పేపర్ 1
- మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
- మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
- ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ :
- మార్చి 16 - గురువారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మార్చి 18 - శనివారం - ఇంగ్లీష్ పేపర్ 2
- మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్ పేపర్ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
- మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేసర్ 2బి, హిస్టరీ పేపర్ 2, జువాలజీ పేపర్ 2
- మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్ 2, ఎకనావిుక్స్ పేపర్ 2
- మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
- ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు)
- ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2
Also Read:
ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఎంసెట్ సిలబస్ తగ్గింపు!
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్‌లో సిలబస్‌ను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లో ఫస్టియర్ నుంచి 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు రానున్నాయి. ఈ మేరకు సిలబస్‌ను ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థమే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'మోడల్ స్కూల్స్' దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్‌లో) ప్రవేశానికి దరఖాస్తుల గడువును మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు గడువును రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసిన గడువును, మరో వారంరోజులపాటు పొడిగించారు. మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 64,350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఉషారాణి తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..