తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్‌లో) ప్రవేశానికి దరఖాస్తుల గడువును మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు గడువును రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసిన గడువును, మరో వారంరోజులపాటు పొడిగించారు. మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 64,350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఉషారాణి తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 15న వెల్లడిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు.
వివరాలు...
* మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2023
ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9, 10.
వయోపరిమితి: 31.08.2023 నాటికి 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.
పరీక్ష ఫీజు: రూ.200. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 09.01.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.02.2023 (మార్చి 8 వరకు పొడిగించారు)
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 08.04.2023.
➥ పరీక్ష తేదీ: 16.04.2023.
పరీక్ష సమయం:
➥ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,
➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
➥ ఎంపిక జాబితా వెల్లడి: 24.05.2023
➥ సర్టిఫికేట్ల పరిశీలన, ప్రవేశాలు: 25.05.2023 - 31.05.2023 వరకు.
➥ తరగతులు ప్రారంభం: 01.06.2023.
నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
TSRJC CET - 2023: టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మహాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ అర్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..