తెలంగాణలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు మే 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. ఫెయిలైన విద్యార్థులు మే 16 వ‌ర‌కు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజు చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును మే 19 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు.


విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని విద్యార్థులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. మే 16తో ముగియాల్సిన గడువును, విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు మే 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువును మే 17 వరకు పొడిగించారు. 


పరీక్ష ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి..


అంతకుముందు, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచాలని ఎస్ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ.. ఇంటర్ బోర్డును కోరింది. ప్రభుత్వ కళాశాలల్లో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లించలేదని.. ఈ నేపథ్యంలో గడువు పెంచి వారికి నష్టం జరగకుండా చూడాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.



Also Read:


డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌ కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 
దోస్త్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


‘సింగిల్‌ స్పెషల్‌’ డిగ్రీ! ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి!
ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో 'సింగిల్‌ సబ్జెక్టు' మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్‌ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం (మే 10)  చైర్మన్‌ ఫ్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘సెట్స్‌’ స్పెషల్‌ ఆఫీసర్‌ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..