Telangana SC Gurukula Admissions: తెలంగాణలోని సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి మిగిలిపోయిన (బ్యాక్‌లాగ్) సీట్ల భర్తీకి దరఖాస్తుల కోరుతున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్  విధానంలో జులై 12 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. అదేవిధంగా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ కోరే విద్యార్థులు జులై 31 వరకు  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

రూ.100 ఫీజుపై తల్లిదండ్రుల ఆందోళన..
బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి  రూ.100 ఫీజు నిర్ణయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం దాదాపు 800 మంది విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిపై నిర్ణయం తీసుకోకుండా కొత్తగా దరఖాస్తులు కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న నిర్ణయం సరికాదంటున్నారు. గతంలో ప్రవేశ పరీక్షకు ఒకసారి ఫీజు చెల్లించామని, మరోసారి ఫీజు వసూలు చేయకూడదని కోరుతున్నారు.  గురుకుల సొసైటీ ఒక్క 5వ తరగతి మినహా.. 6, 7, 8, 9 తరగతి ఖాళీలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేసిందంటున్నారు. 

ప్రాధ్యాన్యక్రమం ప్రకారమే సీట్ల భర్తీ - గురుకుల సొసైటీ
తెలంగాణ ఎస్సీ సొసైటీలో సీట్ల భర్తీలో ప్రాధాన్యక్రమం పాటిస్తున్నట్లు ఎస్సీ గురకుల సొసైటీ అధికారులు చెబుతున్నారు. మొదట సొసైటీలో ప్రవేశాలు దక్కినప్పటికీ.. చేరని వారికి, ప్రవేశపరీక్ష రాసిన వారికి, అనాథలు, సింగిల్ పేరెంట్ ఉన్నవారికి, దివ్యాంగులు, ప్రవేశపరీక్ష రాయని వారికి వరుస క్రమ ప్రాధాన్యత కింద భర్తీ చేస్తామంటోంది. తల్లిదండ్రులు ఎవరూ సొసైటీ, ప్రాంతీయ సమన్వయకర్తల కార్యాలయాలకు రాకూడదని పేర్కొంది. విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అడ్మిషన్‌కు అర్హులైతే రిజిస్టరు మొబైల్ నంబరుకు సమాచారం పంపిస్తామని ఎస్సీ సొసైటీ వివరించింది.

FOR TRANSFERS:

FOR ADMISSIONS:

Notice:

TRANSFER REQUESTS:
➢ The students can submit the transfer application through online from 26.06.2024 to 31.07.2024
➢ The students who are studying from class V to IX in TGSWR, TGTWR and MJPTBC Institutions are eligible to apply for transfer to TGSWR Institutions.
➢ The students applying for transfer request through online does not mean that their transfer request is considered in TGSWR Institution.
➢ Transfers will be considered for classes V to IX by August-2024.
➢ The parent / student need not come to Head Office/RCO Office for any information pertaining to consideration of transfer request.
➢If the transfer of the student is considered in the said class, the parent / student will be informed to the registered mobile number of the candidate.
ADMISSION REQUESTS:
➢ The students can submit the admission application through online from 26.06.2024 to 12.07.2024
➢ The students applying for admission through online for classes V to IX does not mean that they got seat in TGSWR Institutions.
➢ While considering admission request of the student, the following preference will be taken into consideration.
1. Admission provided but not joined
2. Entrance test attended
3. Orphan
4. Semi-Orphan
5. Physically handicapped (PHC)/(Divyangulu)
6. Entrance test not appeared.
➢ The parent / student need not come to Head Office/RCO Office for any information pertaining to consideration of admission request.
➢ If the student is considered for the admission into the arising vacancies if any in the said class the parent / student will be informed to the registered mobile number of the candidate. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..