తెలంగాణలో సోమవారం (అక్టోబరు 10) నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. దసరా సెలవులు ముగియడంతో విద్యా సంస్థలన్నీ పున:ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలకు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 9 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అలాగే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి 9 వరకు ప్రకటించారు. అయితే ఈ సెలవులు ఇక ముగియడంతో అక్టోబరు 10 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 మొత్తం 13 రోజులు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవులను విద్యార్థులు ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ఇంటర్ కాలేజీలకు కూడా వారంపాటు దసరా సెలవులను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ కళాశాలలు కూడా అక్టోబరు 10 నుంచి తెరచుకోనున్నాయి.
ఇక ఏపీలో పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబరు 8న రెండో శనివారం, 9న ఆదివారం కావడంతో అక్టోబరు 10 నుంచే ఏపీలోనూ పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి.
NCERT ప్రతిపాదనలు తోసిపుచ్చిన ప్రభుత్వం..
ఇన్ని రోజులు సెలవులు ఇవ్వడంపై NCERT విద్యాశాఖకు ప్రతిపాదనలను పంపించింది. దసరాకు కేటాయించిన 15 రోజుల సెలవులకు బదులు 9 రోజులు మాత్రమే ఇవ్వాలని విద్యాశాఖకు సూచించింది NCERT. ఈ విద్యాసంవత్సరం ప్రకారం మొత్తం 230 పని దినాలు కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో జులై 7 నుంచి 16 వరకు భారీ వర్షాల నేపథ్యంలో సెలవులను ప్రకటించడంతో పాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో ఒక రోజు సెలవును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయిందని NCERT విద్యాశాఖకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి దసరా సెలవులను సెప్టెంబర్ 26 నుంచి కాకుండా.. అక్టోబర్ 1 నుంచి 9 రోజుల పాటు 9వ తేదీ వరకు ఇవ్వాలని సూచించింది. లేకుంటే.. రెండో శనివారాల్లో స్కూళ్లను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్ లో ఐదు రోజుల పాటు రెండో శనివారాల్లో స్కూళ్లు నడిపాలని.. తద్వారా ఐదు రోజులు కలిసి వస్తుందని సూచించింది. కానీ NCERT ప్రతిపాదనను రాష్ట్ర విద్యాశాఖ తోసిపుచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తర్వాత వచ్చే సెలవులు ఇవే..
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తర్వాత వచ్చే సెలవులు ఇవే..
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.
Also Read:
NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి
NTSE: ఎన్‌టీఎస్ స్కాలర్‌షిప్ పథకం నిలిపివేత! కొత్త స్కాలర్‌షిప్ రూ.5 వేలు?
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష (NTSE)'ను కేంద్రం నిలిపివేసింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్' (NCERT) ప్రకటించింది. ఈ ఏడాది స్కాలర్‌షిప్ పథకం కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, అందువల్లే ప్రతిభావంతుల ఎంపిక నిమిత్తం నిర్వహించే పరీక్షను నిలిపివేసినట్లు NCERT తెలిపింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..