తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ప్రిన్స్’ ట్రైలర్ ఆదివారం యూట్యూబ్‌లో విడుదల అయింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్‌కు జోడిగా ఉక్రెయిన్‌కు చెందిన మారియా ర్యాబోషాప్కా నటించారు. ఒక భారతీయ కుర్రాడు, వేరే దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల జరిగే సమస్యలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. జాతిరత్నాలు సినిమాతో మంచి కామెడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈయనకు ఇది రెండో చిత్రం
‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే దాన్ని నేను సరిగ్గా పాటించాను. అందుకే బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను.’, ‘ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. కానీ ఇదే మొదటిసారి.’ అంటూ అనుదీప్ మార్కు డైలాగులతో ప్రిన్స్ ట్రైలర్‌ను నింపేశారు. అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా మంచి ఫన్ రైడ్‌గా ఉండనుందని ఈ ట్రైలర్‌ను చూసి అర్థం చేసుకోవచ్చు.
'సీమ రాజా', 'రెమో', 'డాక్టర్', 'డాన్' సినిమాలతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
''ఆఫ్గనిస్తాన్, కజికిస్థాన్, ఉజ్బేకిస్థాన్, అంటార్కిటికాలో విడుదల చేయాలనుకున్నా... ఆఫ్గనిస్తాన్‌లో థియేటర్లు లేవు... కజికిస్థాన్‌లో డిస్ట్రిబ్యూటర్లు లేరు... ఉజ్బేకిస్థాన్‌లో మార్కెట్ లేదు. అందుకని, తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం'' అంటూ శివ కార్తికేయన్, కేవీ అనుదీప్, సత్యరాజ్, హీరోయిన్ మరియా విడుదల చేసిన ఇప్పటికే చాలా వైరల్ అయింది.
థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలు.