Nayanthara Vignesh Became Parents : తల్లిదండ్రులైన నయన్ & విఘ్నేష్ శివన్ - జూన్‌లో పెళ్లి, ఇప్పుడు కవలలు

నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళకు పండంటి కవలలు జన్మించారు. 

Continues below advertisement

నయనతార (Nayanthara) భర్త, తమిళ దర్శకుడి విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. నయన్, తాను తల్లి, తండ్రి అయ్యామని సోషల్ మీడియా వేదికగా ఈ రోజు (ఆదివారం, అక్టోబర్ 9న) ప్రకటించారు. తమకు పండంటి కవలలు జన్మించారని ఆయన పేర్కొన్నారు. 

Continues below advertisement

''నయన్, నేను తల్లిదండ్రులు అయ్యాం. మాకు ట్విన్స్ పుట్టారు. ఇద్దరూ అబ్బాయిలే. మా ప్రార్థనలు, పెద్దల ఆశీర్వాదాలు... అన్నిటికి మంచి చల్లటి చూపులు కలిసి మా ఇద్దరికీ మరో ఇద్దర్ని భగవంతుడు ప్రసాదించాడు. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఇక నుంచి వీళ్ళే మా ప్రాణం, ప్రపంచం. జీవితం ఇప్పుడు మరింత అందంగా ఉంది. ప్రకాశవంతంగా మారింది. గాడ్ ఈజ్ డబుల్ గ్రేట్'' అని విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

జూన్‌లో పెళ్లి, నాలుగు నెలల్లో కవలలు
విఘ్నేష్ శివన్ చేసిన ఈ పోస్ట్ చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే... నయనతారతో అతడి వివాహం జూన్ 9న జరిగింది. వీళ్ళిద్దరూ ఏడు అడుగులు వేసి నేటికి (అక్టోబర్ 9) సరిగ్గా నాలుగు నెలలు. దాంతో అప్పుడే పిల్లలు ఎలా పుట్టారు? అనే ప్రశ్న చాలా మందిలో ఎదురైంది. అప్పుడే తల్లిదండ్రులు కావడం ఏమిటి? అని చాలా మంది షాక్ తిన్నారు. 

సరోగసీ ద్వారా...
నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎందుకంటే... వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. సహా జీవనం చేశారని కూడా తమిళ చిత్రసీమ చెబుతోంది. 

పెళ్ళైన వెంటనే మాల్దీవులకు నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ ట్రిప్ వేశారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తున్న 'జవాన్' షూటింగులో నయనతార జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందుకు పలు సార్లు వచ్చారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ రిలీజ్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ చేశారు. ఆ సమయాల్లో ఎప్పుడూ ఆమె ప్రెగ్నెంట్ అనేది బయటకు రాలేదు.

Also Read :  Chiranjeevi Emotional Speech At Godfather Success Meet : 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?

మాల్దీవ్స్ తర్వాత స్పెయిన్ ట్రిప్ కూడా వేశారు నయన్ అండ్ విఘ్నేష్. ముందు మాల్దీవ్స్, ఆ తర్వాత స్పెయిన్... ఎప్పటికప్పుడు విఘ్నేష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్కడా నయనతార గర్భంతో ఉన్నట్టు కనిపించలేదు. మరి, ఇప్పుడు పిల్లలు ఎలా పుట్టారు? అనే సందేహం సగటు సినిమా ప్రేక్షకుడిలో రావడం సహజం.

 పెళ్లికి ముందు నుంచి నయనతార, విఘ్నేష్ శివన్ పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారట. సరోగసీ ద్వారా పండంటి కవలలకు జన్మ ఇచ్చారని సమాచారం. సరోగసీ ద్వారా షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, తెలుగులో లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరారని చెప్పవచ్చు. 

Also Read :  Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

Continues below advertisement