తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం (జులై 22) సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం (జులై 21) తెలిపారు.


రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే గురువారం (జులై 20), శుక్రవారం (జులై 21) తేదీల్లో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జులై 22న కూడా సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యాసంస్థలు జులై 23న ఆదివారం కావడంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి సోమవారం (జులై 22న) తెరచుకోనున్నాయి.


అన్ని ఆఫీసులకు కూడా సెలవు, వీటికి మినహాయింపు..
మూడు రోజులుగా ఎడ తెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల  విద్యాసంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు జులై 21, 22 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం కూడా అన్ని కార్యాలయాలకు సెలవు పాటించనున్నాయి. అయితే అత్యవసర సేవలు అయిన వైద్యం, పాల సరఫరా లాంటివి కొనసాగుతాయని సీఎం తెలిపారు. ప్రయివేట్ సంస్థలు కూడా సెలవులు పాటించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.


ALSO READ:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - మరో రెండు రోజులపాటు వర్షాలు: ఐఎండీ వార్నింగ్
ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. గత కొన్నిరోజులుగా మోస్తరు వర్షం పడగా.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే శనివారం భద్రాచలం వద్ద వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం.. ఆదివారం నుంచి వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. బుధ, గురువారాల వరకు వరద ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి- భారీ వర్షాలు, వరదలపై సమీక్షలో కేసీఆర్
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ వర్షాలతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వర్షాలపై శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సీఎస్​శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బీసీ శాఖలు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..