తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికిగాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. కోర్సుల వారీగా తగిన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు చెందిన  అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివ‌రాలు..


✶ స్విమ్స్ ప్రవేశాలు 


మొత్తం సీట్ల సంఖ్య: 229


కోర్సుల వారీగ సీట్ల వివరాలు:


1.బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ-ఎన్): 100 సీట్లు


2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): 50 సీట్లు


3. బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ(ఏటీ): 12 సీట్లు


4. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): 20 సీట్లు


5. బీఎస్సీ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్ఐటీ): 09 సీట్లు


6.బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు


7.బీఎస్సీ ఈసీజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ: 08 సీట్లు


8. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ): 12 సీట్లు


9. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ: 04 సీట్లు


10. బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 04 సీట్లు


11.బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ(ఆర్‌టీ): 06 సీట్లు


12. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ: 02 సీట్లు


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.బీపీటీ 4 ½ సంవత్సరాలు.


అర్హత: అభ్యర్ధులు 45% మార్కులతో ఇంటర్ బైపీసీ లేదా ఇంటర్ ఒకేషనల్, బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్-2022 ర్యాంకు సాధించి ఉండాలి.


ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్ -2022 ర్యాంకు ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: రూ.2360. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1888 చెల్లించాలి.


ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 26.08.2022.


ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.09.2022.


తుది మెరిట్ జాబితా ప్రదర్శన: 30.09.2022.


ఒకటో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.10.2022.
తరగతుల ప్రారంభం: 14.10.2022.


UG Notification 


Online application 


UG Prospectus 


Website  


 


Also Read:


NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
తెలంగాణలోని వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య రెట్టింపయ్యాయి. ఈ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, వరంగల్, పాలెం (నాగర్‌కర్నూల్ జిల్లా)లోని మూడు వ్యవసాయ కళాశాలల్లో ప్రస్తుతం 60 చొప్పున సీట్లు ఉన్నాయి. అయితే తాజా సీట్ల పెంపుతో ఈ సంఖ్య 120కి పెరిగింది. దీంతో మొత్తం 180 సీట్లు పెరగడంతో ఈ వర్సిటీ పరిధిలోని మొత్తం ఆరు ప్రభుత్వ కళాశాలల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 840కి చేరినట్లయింది. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


CLAT 2023: కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాల కోసం క్లిక్ చేయండి


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..