మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా ‘లైగర్’. ఈ నెల 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమ్మురేపుతుందని అందరూ భావించారు. కానీ, ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తొలి షో నుంచే విపరీతమైన నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో  ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తున్నది. కథ, కథనం, దర్శకత్వంలో లోపాలున్నా.. విజయ్ మాత్రం శక్తి వంచన లేకుండా నటించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన నటన మూలంగానే సినిమా ఈ మాత్రం అయినా నిలబడిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. విజయ్ రెండేళ్ల కష్టం ఈ సినిమాలోని ప్రతి సీన్ లో కనిపిస్తుందని ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు.


మైక్ టైసన్ బూతులు తిట్టారు


అటు లైగర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్. తాజాగా ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. లైగర్ సినిమా షూటింగ్ సమయంలో టైసన్ తనను చాలా సార్లు తిట్టారని వెల్లడించాడు. ఆ బూతులను  బయటకు చెప్పలేనన్నాడు. అయితే, ఆ మాటలన్నీ తన మీద ప్రేమతోనే మైక్ టైసన్ అన్నాడని విజయ్ చెప్పాడు. ఇండియా అంటే టైసన్ కు ఎంతో గౌరవం అని చెప్పాడు. ఇక్కడి ఆహారపు అలవాట్లు, సంగీతాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తాడని చెప్పాడు. పెద్ద సంఖ్యలో జనాలను చూస్తే ఆయన భయపడతారని చెప్పాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చినప్పుడు.. తనను చూసేందుకు ప్రేక్షకులు గుంపులుగా రావడంతో, హోటల్ నుంచి భయటకు రాలేదని విజయ్ వెల్లడించాడు.   


కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగానే


ఇక లైగర్ సినిమా అనుకున్నంత స్థాయిలో బిజినెస్ చేయకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా థియేటర్లకు జనాలు పెద్దగా రాకపోవడం మూలంగానే వసూళ్లు భారీగా తగ్గిపోయాయని వెల్లడిస్తున్నాయి. సినిమా జనాలను ఆకట్టుకోకపోవడానికి చాలా కారణాలున్నియని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాను అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో పూరి సక్సెస్ కాలేదంటున్నారు. అటు విజయ్ దేవరకొండ ప్రవర్తన, మాటలు సైతం సినిమా మీద దెబ్బ పడటానికి కారణం అయ్యాయంటున్నారు. బాలీవుడ్ బాయ్ కాట్ లాంటి వివాదాస్పద విషయాల్లో విజయ్ తల దూర్చడం మూలంగా సినిమా పెద్ద పెద్ద ప్రభావం పడినట్లు అయ్యిందంటున్నారు. విజయ్ మాటల మూలంగానే సినిమా ఆడటం లేదని.  మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ బహిరంగంగానే ఆరోపించారు. విజయ్ దేవరకొండ ప్రవర్తన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పుడు అదే జరుగుతుందని మనోజ్ దేశాయ్ తీవ్ర విమర్శలు చేశారు.  ఈ నేపథ్యంలో విజయ్, మనోజ్ ను కలిసి మాట్లాడారు. అటు ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాతగా ఉండటం, ఆయన ప్రమోట్ చేసే అనన్య పాండే హీరోయిన్ కావడం కూడా సినిమాకు మైనస్ అయ్యాయంటున్నారు. 


Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్