PJTSAU: అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశ ప్రకటన, దరఖాస్తు ఇలా!

ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయడానికి వర్సిటీ ఆగస్టు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Continues below advertisement

తెలంగాణలోని వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య రెట్టింపయ్యాయి. ఈ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, వరంగల్, పాలెం (నాగర్‌కర్నూల్ జిల్లా)లోని మూడు వ్యవసాయ కళాశాలల్లో ప్రస్తుతం 60 చొప్పున సీట్లు ఉన్నాయి. అయితే తాజా సీట్ల పెంపుతో ఈ సంఖ్య 120కి పెరిగింది. దీంతో మొత్తం 180 సీట్లు పెరగడంతో ఈ వర్సిటీ పరిధిలోని మొత్తం ఆరు ప్రభుత్వ కళాశాలల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 840కి చేరినట్లయింది. 

Continues below advertisement


ప్రవేశ ప్రకటన విడుదల..
 

ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయడానికి వర్సిటీ ఆగస్టు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది.



DOST Admissions: దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?


వెటర్నరీ, హార్టీ కోర్సులకు కూడా..

వీటితో పాటు కొండా లక్ష్మణ్ ఉద్యాన, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని ఉద్యాన బీఎస్సీ, బీవీఎస్సీ (పశువైద్య), బీఎఫ్ఎస్సీ (మత్స్యశాస్త్రం) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను జయశంకర్ వర్సిటీ నిర్వహిస్తోంది. ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 



HORTICET - 2022: ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఫీజులు ఇలా..
మెరిట్ ర్యాంకు ప్రకారం ఉచితంగా సీటు పొందితే ఏజీ బీఎస్సీకి రూ.39,000, పశువైద్య డిగ్రీకి రూ.55,800, బీఎఫ్  ఎస్సీ (మత్స్యశాస్త్రం)కి రూ.42,290, ఉద్యాన బీఎస్సీకి రూ.47,090 చొప్పున రుసుం చెల్లించాలి. ఇవి కాకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్  కోటా కింద సీటు పొందితే ఏజీ బీఎస్సీకి రూ.14 లక్షలు, ఉద్యాన బీఎస్సీకి రూ.9 లక్షల చొప్పున విద్యార్థులు ఫీజు చెల్లించాలని జయశంకర్ వర్సిటీ స్పష్టం చేసింది. ఈ మూడు డిగ్రీల్లో రైతు కుటుంబం పిల్లలకు ప్రత్యేకంగా 40 శాతం సీట్లను రిజర్వు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి తొలి రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తరవాత మాత్రమే వ్యవసాయ డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-08-2022 (10:00 AM)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19-09-2022 (5:00 PM)

నింపిన ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 21-09-2022 (5:00 PM)

దరఖాస్తుల సవరణ: 22-09-2022 (10:00 AM) & 23-09-2022 (5:00 PM)


Notification


Online Application

 

Also Read:

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement