ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి మరింత తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశ రాజధానిలో వాయు నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలను మూసివేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర ప్లాన్‌ను సిద్ధం చేయాలని కోరింది. ఈ మేరకు ఎన్‌సీపీసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. నవంబరు 2న ఢిల్లీలో ‘వెరీ పూర్’ కేటగిరిలో నమోదైంది. నవంబరు 3న సైతం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. గాలి నాణ్యత పడిపోతున్న నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి గోపాల్‌రాయ్ ఉద్యోగులు ఇండ్ల నుంచి పని చేయాలని సూచించారు. ప్రైవేటు వాహనాలను వినియోగించొద్దని కోరారు. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో నవంబరు 2న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 345గా రికార్డయ్యింది.
గతేడాది సుప్రీం జోక్యం...
గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆ సందర్భంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించి అయినా సరే కాలుష్యాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. AQI 500 నుంచి 200 తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నోటిసులపై స్పందించిన కేజ్రీవాల్ ప్రభుత్వం వారంపాటు స్కూళ్లు మూసివేశారు. విద్యార్థులకు పూర్తిగా ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేసింది. ఈ వారం రోజులపాటు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించారు. అంతేకాకుండా వ్యాపార, నిర్మాణ తదితర పనులన్నీ నిలిపేశారు. ప్రభుత్వ కార్యాలయ సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించింది. మరి ఈ సారి సుప్రీంకోర్టు, రాష్ట్రప్రభుత్వాలు ఢిల్లీ కాలుష్య విషయమై ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.
Also Read:
ISB Course: ఐఎస్‌బీలో పీజీ ప్రోగ్రామ్, వీరు మాత్రమే అర్హులు!!
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)- పీజీ ప్రోగ్రామ్ ప్రో(పీజీపీ ప్రో)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆంత్రప్రెన్యూర్స్‌కు ఉద్దేశించించిన ఈ ప్రోగ్రామ్ వ్యవధి 18 నెలలు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది వీకెండ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇందులో ఫౌండేషన్ కోర్సులు, కోర్ కోర్సులు, అడ్వాన్స్‌డ్ కోర్సులు, స్పెషలైజేషన్ కోర్సులు ఉంటాయి. ఆల్టర్‌నేట్ వీకెండ్ తరగతులు నిర్వహిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..