ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 12 నుంచి 16 వరకు క్యాంపస్‌ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
అక్టోబరు 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లలో; అక్టోబరు 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌లో; అక్టోబరు 15, 16 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 17 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
ఈ ఏడాది నాలుగు క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం మొత్తం 44,208 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ సెప్టెంబర్ 29న విడుదల చేసింది. ఒక్కో క్యాంపస్‌లో 1030 సీట్ల చొప్పున మొత్తం 4,120 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థుల జాబితా క్యాంపస్‌లవారీగా:
- Provisionally selected candidates for RKValley Campus
- Provisionally selected candidates for Nuzvid Campus
- Provisionally selected candidates for Ongole Campus
- Provisionally selected candidates for Srikakulam Campus
Also Read:
Medical Seats : వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, బీ-కేటగిరి సీట్లలో 85 శాతం స్థానికులకే!
వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా నిబంధనలు సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జీవో నెంబర్ 129, 130లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 1068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి.
సీట్ల వివరాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ సెప్టెంబరు 27న విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఇదివరకే ప్రకటించిన షెడ్యూలు మేరకు ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబరు 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. అభ్యర్థులు అక్టోబరు 18 నుంచి 21 వరకు ట్యూషన్ ఫీజు, కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..