ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు పరీక్షల తాజా షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు.
Also Read: DOST Admissions: దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎంఏ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంలిబ్‌ఐఎస్సీ, ఎంజేఅండ్‌ఎంసీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను సెప్టెంబరు 2 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
అలాగే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను సెప్టెంబరు 7 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
Also Read
PJTSAU: అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశ ప్రకటన, దరఖాస్తు ఇలా!
తెలంగాణలోని వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య రెట్టింపయ్యాయి. ఈ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, వరంగల్, పాలెం (నాగర్‌కర్నూల్ జిల్లా)లోని మూడు వ్యవసాయ కళాశాలల్లో ప్రస్తుతం 60 చొప్పున సీట్లు ఉన్నాయి. అయితే తాజా సీట్ల పెంపుతో ఈ సంఖ్య 120కి పెరిగింది. దీంతో మొత్తం 180 సీట్లు పెరగడంతో ఈ వర్సిటీ పరిధిలోని మొత్తం ఆరు ప్రభుత్వ కళాశాలల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 840కి చేరినట్లయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....
Also Read
HORTICET - 2022: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి. అక్టోబరు 12న హార్టీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..