ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థుల సౌకర్యం కోసం ఇంజినీరింగ్ కాలేజీ అఫిలియేషన్లపై జేఎన్‌టీయూ కసరత్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా 123 ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాలను ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్‌కు పంపినట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ సేన్ తెలిపారు. 123 కాలేజీలలో కలిపి దాదాపు 80 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయని, వాటిని ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి వీలుంటుందని అన్నారు.
Also Read: KNRUHS: పీజీ డెంటల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలోనే దాదాపు 40 శాతం వరకు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్ డిమాండ్, విద్యార్థుల ఆసక్తిని బట్టి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఈ కోర్సుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. అలాగే త్వరలో మరో ఏడు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.
Also Read: DOST Admissions: దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
అయితే కొన్ని కాలేజీల్లో నియామకాల ఖాళీల వల్ల వాటికి మరో అవకాశం ఇచ్చేందుకు ఒకటి రెండు రోజులు అఫిలియేషన్ పెండింగ్‌లో పెట్టినట్టు సేన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆయా కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నదని అన్నారు. మరో నాలుగు వేల వరకు సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
☛ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
☛ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
☛ ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
☛ సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
☛ సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
☛ సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
☛ సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
☛ అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛ అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
☛ అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
☛ అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛ అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ
కౌన్సెలింగ్ పూర్తి సమాాచారం కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించే వివిధ రెగ్యులర్ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం సెప్టెంబరు 2న బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఏ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సులకు; అదేవిధంగా సెప్టెంబరు 3న బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఎంఏ తెలుగు కోర్సులకు ప్రశేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మొదటి సెషన్‌లో, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రవేశపరీక్ష ఫలితాలను సెప్టెంబరు 5న విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబరు 8, 9వ తేదీల్లో కోర్సులో చేరడానికి కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను ఆగస్టు 31 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read: