రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్డ్ ఫోన్‌లో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 31వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ను ఈ ఫోన్ పనిచేయడానికి . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
డ్యూయల్ స్పీకర్ సెటప్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 178.8 గ్రాములుగా ఉంది.
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. చార్‌కోల్ బ్లాక్, స్లేట్ గ్రే, సీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!