ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ లాంటి యాప్స్ కామన్ గా వాడుతున్నారు. ఎవరు ఏ విషయం చెప్పాలన్నా.. జస్ట్ వాట్సాప్ లో పింగ్ చేస్తున్నారు. మామూలు చాటింగ్ నుంచి కంపెనీ పనుల వరకు వాట్సాప్ ద్వారానే నిర్వహించే పరిస్థితి నెలకొంది. అందుకే ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్ర నిద్రపోయే వరకు వాట్సాప్ చెక్ చేస్తూనే ఉంటారు. అయితే, పదే పదే పెట్టే మెసేజ్ లు, వాట్సాప్ కాల్స్ ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో వారు మిమ్మల్ని వాట్సాప్ లో బ్లాక్ చేసే అవకాశం ఉంది. అయితే బ్లాక్ చేసిన వ్యక్తికి కూడా మెసేజ్ లేదంటే కాల్స్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే బ్లాక్ చేసిన వ్యక్తులకు మెసేజ్ చేయవచ్చు. ఇంతకీ వారికి ఎలా మెసేజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. మీకు మీరే దాన్ని అన్ బ్లాక్ చేసుకోవచ్చు. తెలియకపోతే ఇలా చేస్తే సరిపోతుంది. ఈ ట్రిక్ తో ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసిన సరే అన్ బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటిలాగే మెసేజ్ లు పంపే వీలుంటుంది. ఈ ట్రిక్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మీ నంబర్ బ్లాక్ చేశారో? లేదో? తెలుసుకోండి
ఫస్ట్ మనం ఎదుటి వ్యక్తి మనల్ని బ్లాక్ చేశారో? లేదో? చెక్ చేయాలి. ఇందుకోసం మొదట వాట్సాప్ నుంచి వారికి మెసేజ్ పంపించాలి. మీరు పంపించిన మెసేజ్ కింద డబుల్ టిక్స్ పడకపోతే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం. మిమ్మల్ని బ్లాక్ చేసిన తర్వాత అన్ బ్లాక్ చేసుకునే విధానం ఇలా ఉంటుంది..
వాట్సాప్‌లో మిమ్మల్ని మీరు అన్ బ్లాక్ ఎలా చేసుకోవాలంటే?
⦿ ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లాలి. అకౌంట్ మీద క్లిక్ చేయాలి
⦿ ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ ఆ తర్వాత కంట్రీ కోడ్ తో పాటు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
⦿ ఇప్పుడు డిలీట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి.
⦿ అనంతరం ఎందుకు అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి.
⦿ వాట్సాప్ డిలీట్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.
⦿ మళ్లీ మీ డీటైల్స్‌తో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
⦿ ఇప్పుడు ఆటోమేటిగ్గా మిమ్మల్ని మీరు అన్ బ్లాక్ చేసుకుంటారు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంటుంది.
ఇలా కూడా ట్రై చేయండి
మీ స్నేహితుడిని వాట్సాప్ కొత్త గ్రూప్ క్రియేట్ చేయమని అడగండి. అందులో మీ నంబర్ ను యాడ్ చేయమని చెప్పండి. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని కూడా ఇందులో యాడ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఆ గ్రూపులో మీరు పెట్టే పోస్టులను మిమ్మల్ని బ్లాక్ చేసే వ్యక్తి కూడా చూస్తాడు.
Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి