NTR Merit Scholarship Test for Degree Students:  ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ట్రస్టు ద్వారా 'గర్ల్స్‌ ఎడ్యుకేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ టెస్టు (GEST) 2024-24'ను జూన్ 9న నిర్వహించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ద్వారాఉపకార వేతనం అందజేస్తారు. పరీక్ష రాసిన వారిలో మొదటి పది ర్యాంకులు పొందిన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు చొప్పున, ఆ పై ర్యాంకులు సాధించిన 15 మంది విద్యార్థులకు నెలకు రూ.3 వేలు చొప్పున ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్‌ డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థినులకు డిగ్రీ పూర్తిచేసే వరకు ఉపకార వేతనాలు ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే జూన్ 7 దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 76600 02627/28 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


* గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST) 2024


అర్హత: 2024 మార్చి/ఏప్రిల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సీబీఎస్‌ఈ 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: స్కాలర్‌షిప్ టెస్ట్ ఆధారంగా.


దరఖాస్తు పీజు: రూ.250.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఇంటర్ స్థాయిలోనే పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 


పరీక్షకు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి: రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, ఫొటో ఐడీకార్డు లేదా స్కూల్ ఐడీ కార్డు.


ముఖ్యమైన తేదీలు..


⫸ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2024. 


⫸ దరఖాస్తుకు చివరితేది: 07.06.2024.


⫸ పరీక్ష తేది, సమయం: 09.06.2024(ఆదివారం), ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


వేదిక: NTR Junior & Degree College for Women.
           Chilukur Balaji Temple Road, Himayath Nagar Village,
           Moinabad Mandal, R.R. Dist., Telangana 500075.


Online Application




ALSO READ:


సీపీగెట్ – 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2024’ నోటిఫికేషన్‌ మే 15న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీపీగెట్‌ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి జూన్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులు రూ.500 ఆలస్యరుసుముతో జూన్ 25 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. జులై 5 నుంచి సీపీగెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సీపీగెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...